iDreamPost

4 ఏళ్ల వారంటీతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్! ఇది కదా జనానికి కావాల్సింది!

Smartphone With 4 Years Warranty: కొంతమందికి వాడకం ఎక్కువ. వాళ్ళ చేతుల్లో ఏ వస్తువు పడినా ఎక్కువ రోజులు మన్నదు. ఇక స్మార్ట్ ఫోన్ అయితే ఏడాది తర్వాత నన్నొగ్గెయ్ రా బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలాంటి వారి కోసమే ప్రముఖ కంపెనీ స్మార్ట్ ఫోన్లపై 4 ఏళ్ల వారంటీ ఇస్తున్నట్టు ఉంది.

Smartphone With 4 Years Warranty: కొంతమందికి వాడకం ఎక్కువ. వాళ్ళ చేతుల్లో ఏ వస్తువు పడినా ఎక్కువ రోజులు మన్నదు. ఇక స్మార్ట్ ఫోన్ అయితే ఏడాది తర్వాత నన్నొగ్గెయ్ రా బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలాంటి వారి కోసమే ప్రముఖ కంపెనీ స్మార్ట్ ఫోన్లపై 4 ఏళ్ల వారంటీ ఇస్తున్నట్టు ఉంది.

4 ఏళ్ల వారంటీతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్! ఇది కదా జనానికి కావాల్సింది!

ఏ స్మార్ట్ ఫోన్ అయినా ఏడాది తర్వాత సరిగా పని చేయదు. పెర్ఫార్మెన్స్ పరంగా స్లో అయిపోతుంది. అది ఎంత పెద్ద తోపు బ్రాండ్ కి చెందిన ఫోన్ అయినా సరే ఫస్ట్ లో ఉన్నంత పెర్ఫార్మెన్స్ ఏడాది తర్వాత ఉండదు. కొందరు జాగ్రత్తగా వాడేవారు ఉంటారు.. వారి ఫోన్లు బానే పని చేస్తాయి. అయితే ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, కొంచెం అజాగ్రత్తగా వాడినా ఫోన్లు ఏడాది తర్వాత పాడవ్వడం అనేది మామూలే. ఇక నాలుగేళ్లు గడిస్తే ఆ ఫోన్ ని మర్చిపోవాల్సిందే. అయితే ఇప్పుడు ఫోన్ ని మర్చిపోనవసరం లేదు. ఎందుకంటే ఓ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఫోన్లపై ఏకంగా నాలుగేళ్ళ వారంటీ ఇస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్ మోటోరోలా సంస్థ చైనాలో జూన్ 25న జరగనున్న ప్రాడెక్ట్ లాంఛ్ కాన్ఫిరెన్స్ లో పాల్గొననుంది. ఈ ఈవెంట్ లో రెండు కొత్త మోటోరోలా ఫోన్లను పరిచయం చేయనుంది. మోటోరోలా రేజర్ 50, రేజర్ 50 అల్ట్రా, మోటో ఎస్50 నియో ఫోన్లను లాంచ్ చేయనుంది. వీటిలో మోటో ఎస్50 నియో ఫోన్ ఏకంగా 4 సంవత్సరాల వారంటీతో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వారంటీలో సాధారణ వారంటీ కింద ఒక ఏడాది, కాంప్లిమెంటరీ కింద 3 ఏళ్ల వారంటీ ఇస్తుంది. గతంలో షావోమీ, వన్ ప్లస్, లెనోవో వంటి బ్రాండ్లు కొన్ని మోడల్స్ పై రెండేళ్ల వారంటీలను ఇచ్చాయి. మైజు కంపెనీకి చెందిన 20, 21 సిరీస్ లపై స్పెషల్ ప్రమోషన్ సమయంలో మూడేళ్ళ వారంటీలను అందించాయి. అయితే వీటి కంటే ఎక్కువ వారంటీతో మోటోరోలా ఎస్ 50 నియో ఫోన్ వస్తుంది. 4 ఏళ్ల పాటు వారంటీతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ గా ఇది రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ వారంటీలతో పోలిస్తే ఈ ఫోన్ బ్రాండే ఎక్కువ వారంటీతో వస్తుంది. దీంతో నాలుగేళ్ళ వారంటీతో వస్తున్న తొలి ఫోన్ గా ఉంది. ఇక దీని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వంటి విషయాలు గమనిస్తే.. 

అంచనా స్పెసిఫికేషన్స్:

  • మోటో ఎస్50 నియో స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే
  • ఎడ్జ్ స్క్రీన్ 
  • ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్ 
  • 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు
  • అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ 
  • 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరాలు 
  • 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ 
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ 
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 
  • 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
  • 7.59 ఎంఎం స్లిమ్ బాడీ
  • రంగులు: నలుపు, నీలం, ఆకుపచ్చ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి