iDreamPost

ఆ నెట్వర్క్ సిమ్ వాడుతున్నారా? ఐతే మీరు రిస్క్‌లో పడినట్లే.. ప్రముఖ కంపెనీ హెచ్చరిక!

Those Sim Card Users In Risk Says Tech Company: ఆ నెట్వర్క్ సిమ్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ లో పడినట్లే. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ కంపెనీ వెల్లడించింది. హ్యాకర్లు ఆ నెట్వర్క్ కి చెందిన యూజర్ల డేటాను హ్యాక్ చేశారని.. దీని వల్ల భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉందని సదరు కంపెనీ హెచ్చరించింది.

Those Sim Card Users In Risk Says Tech Company: ఆ నెట్వర్క్ సిమ్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ లో పడినట్లే. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ కంపెనీ వెల్లడించింది. హ్యాకర్లు ఆ నెట్వర్క్ కి చెందిన యూజర్ల డేటాను హ్యాక్ చేశారని.. దీని వల్ల భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉందని సదరు కంపెనీ హెచ్చరించింది.

ఆ నెట్వర్క్ సిమ్ వాడుతున్నారా? ఐతే మీరు రిస్క్‌లో పడినట్లే.. ప్రముఖ కంపెనీ హెచ్చరిక!

ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ ఇలా ఆయా కంపెనీలకు చెందిన నెట్వర్క్ సిమ్ కార్డులు వాడుతుంటారు యూజర్లు. అయితే ప్రముఖ దిగ్గజ సైబర్ టెక్ కంపెనీ ఆ నెట్వర్క్ సిమ్ కార్డులు వాడేవారు రిస్క్ లో ఉన్నారని తన నివేదికలో తెలిపింది. ఏకంగా ఆ నెట్వర్క్ కి చెందిన 278 జీబీ వ్యక్తిగత డేటాను హ్యాక్ చేశారని.. దాన్ని అమ్మకానికి కూడా ఉంచారని వెల్లడించింది. ఈ డేటాను కొనుక్కున్నవారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడే అవకాశం ఉందని.. అంతేకాకుండా యూజర్ల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి డబ్బును దోచుకుంటారని హెచ్చరించింది.    

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సంబంధించి డేటా మరోసారి రిస్క్ లో పడింది. గడిచిన ఆరు నెలల్లో ఈ నెట్వర్క్ కి చెందిన యూజర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి. ఈ డేటాలో సిమ్ కార్డు వివరాలు, అంతర్జాతీయ మొబైల్ సబ్స్క్రైబర్స్ గుర్తింపు, హోమ్ లొకేషన్ వంటి సమాచారం ఉన్నట్లు అథెనియన్ టెక్నాలజీస్ పేర్కొంది. అథెనియన్ టెక్ కంపెనీ అనేది.. డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీ. సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా హ్యాకింగ్ వంటి సమస్యల మీద పరిష్కారం చూపించే కంపెనీ. డేటా లీక్ అయినా అలర్ట్ చేస్తుంటుంది. ఏదైనా కంపెనీ డేటాను హ్యాకర్స్ హ్యాక్ చేస్తే ఈ కంపెనీ పసిగడుతుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి చెందిన డేటా హ్యాక్ అయ్యిందని తెలిపింది.

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు సంబంధించి 278 జీబీ వ్యక్తిగత డేటా తన దగ్గర ఉందంటూ కిబర్ ఫాంటోమ్ అనే వ్యక్తి 5 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టాడని అథెనియన్ టెక్నాలజీస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఈ డేటాను ఉపయోగించి నకిలీ సిమ్ కార్డులను సృష్టించే అవకాశం ఉందని.. దీని వల్ల యూజర్ల డేటా దుర్వినియోగం అవుతుందని అథెనియన్ టెక్నాలజీస్ తెలిపింది. ఈ వివరాలతో వినియోగదారుల వ్యక్తిగత ఖాతాలను సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఇల్లీగల్ గా యాక్సెస్ చేస్తారని.. సైబర్ దాడులు, సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గతేడాది డిసెంబర్ నెలలో బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్, ల్యాండ్ లైన్ వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత డేటా బయటకొచ్చింది. ఇప్పుడు మరోసారి హ్యాక్ చేశారని అథెనియన్ టెక్ తెలిపింది. ఈ తరహా డేటా లీకేజ్ వల్ల కస్టమర్లకు కంపెనీల పట్ల ఉన్న నమ్మకం పోతుందని.. న్యాయపరంగా కూడా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి