Tirupathi Rao
Full Details And Features OF Meta Developed New AI Chatbot: మెటా సంస్థ ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రంగాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. తాము తీసుకొచ్చే ఏఐ చాట్ బాట్ గనుక ఇండియాలో అందుబాటులోకి వస్తే ఒక పెద్ద సంచలనం అవుతుందని చెప్పచ్చు.
Full Details And Features OF Meta Developed New AI Chatbot: మెటా సంస్థ ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రంగాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. తాము తీసుకొచ్చే ఏఐ చాట్ బాట్ గనుక ఇండియాలో అందుబాటులోకి వస్తే ఒక పెద్ద సంచలనం అవుతుందని చెప్పచ్చు.
Tirupathi Rao
మనలో చాలా మంది మెటా కంపెనీ పేరు వినే ఉంటారు. కాని మీకు తెలుసా? ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఇలా మనం వాడే యాప్స్ అన్నీ కూడా ఈ మెటా సంస్థ ద్వారానే రన్ అవుతున్నాయి. అయితే రీసెంట్ గా వాట్సాప్ ఒక పని చేసింది. వాట్సాప్ వాడేప్పుడు మధ్యలో ఎవరికైనా కాల్స్ చెయ్యాలి అంటే కచ్చితంగా యాప్ నుండి ఎగ్జిట్ అయ్యి కాల్స్ చేసుకోవాలి. దీని వలన ఆ ఫోన్ కాల్ చేసుకునే కాసేపు వాట్సాప్ ని ఆపాల్సి వస్తుంది. తరువాత ఆ కష్టం లేకుండా.. వాట్సాప్ నుండి ఎగ్జిట్ అవ్వకుండానే డైరెక్ట్ గా ఫోన్ కాల్స్ చేసుకునే కొత్త ఫీచర్ ని తీసుకుని వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో ఇంకో కొత్త ఫీచర్ ని మెటా ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాని పేరే ‘మెటా AI చాట్ బాట్’.
ఈ AI చాట్ బాట్ ఏం చేస్తుంది అంటే. మనం డైలీ వాడుకునే వాట్సాప్, మెసెంజర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ ఇలా ప్రతి యాప్ కి ఈ చాట్ బాట్ అనుసంధానంగా ఉంటుంది. ఈ మెటా AI మనకి- ప్రొఫెషనల్ ఇ-మెయిల్ రాస్తుంది, కంటెంట్ ని క్రియేట్ చేస్తుంది, ఫొటోస్ ని జెనరేట్ చేస్తుంది, ఐడియాస్ ని విజువలైజ్ చేస్తుంది, ఏదైనా కాంప్లికేటెడ్ మ్యాథ్స్ ప్రాబ్లంస్ ని సాల్వ్ చేస్తుంది. మన ఇంట్రెస్ట్ కి తగినట్టుగా మనకి కావలసినవి నెట్ లో వెతికి పెడుతుంది. అలాగే డిఫరెంట్ టాపిక్స్ పైన ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారాన్ని చూపిస్తుంది. మనకి ఐడియాస్ ని జెనరేట్ చేస్తుంది. మన దగ్గర ఫొటోస్ లో ఉన్న టెక్స్ట్ అయినా.. ఇంకా ప్లైన్ టెక్స్ట్ ని అయినా కూడా వివిధ భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేసి పెడుతుంది. అలాగే మన కోసం అందమైన కవితలని కూడా రాసి పెడుతుంది. ఇంకా ఎక్కువగా ఉండే ఇన్ఫర్మేషన్ ని చాలా తక్కువకి సమరైజ్ చేస్తుంది.
నిజానికి ఈ అప్డేట్ ఇంకా ఇండియాలో అందుబాటులోకి రాలేదు. కానీ కొద్ది రోజుల్లోనే ఇండియాలోకి అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. అలా వచ్చిన తరవాత వాట్సాప్ లో ఈ ఏఐ చాట్ బాట్ ని వాడాలి అంటే ఇలా చెయ్యాలి. ముందుగా వాట్సాప్ ని ఓపెన్ చేసి.. ఏదైనా ఒక చాట్ బాక్స్ ని ఓపెన్ చేయాలి. ‘META AI” ఐకాన్ అనే చాట్ ట్యాబు ఉంటుంది. అది ప్రెస్ చేశాక.. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత మన ప్రాంప్ట్ ని వాట్లాప్ ఏఐ చాట్ బాట్ కి ఇవ్వాలి. అప్పుడు ఆ ప్రాంప్ట్ ప్రకారం మనకి రీజల్ట్ వస్తుంది. ప్రాంప్ట్ అంటే AI కి అర్థమయ్యే భాష. మనకి కావాలిసింది చెప్పి AI ద్వారా ఒక రిజల్ట్ ని జనరేట్ చేసుకునేలా చెయ్యడాన్నే ప్రాంప్ట్ అంటారు.
ఇదే ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఏదైనా ఒక కన్వర్ జేషన్ ఓపెన్ చేసి ‘@’ అని టైపు చేసి మెటా AIని ట్యాప్ చెయ్యాలి. ఆ తరవాత మన ప్రాంప్ట్ ని ఇవ్వాలి. మెటా AI మన ప్రాంప్ట్ కి తగ్గట్టుగానే రిజల్ట్ ఇస్తుంది. మొత్తానికి మెటా తన కొత్త AI బాట్ తో మార్కెట్ లో ఉన్న అన్ని AI టూల్స్ ని బీట్ చేసే ఉద్దేశంతోనే ఈ మెటా AIని మార్కెట్లోకి దింపుతోంది. మాములుగా ఈ ప్రాజెక్ట్ ని 2 నెలల ముందే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు కొన్ని దేశాల్లో ఈ AI చాట్ బాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. న్యూజిల్యాండ్, కెనడా, ఆస్ట్రేలియా.. ఇందులో ఉన్న ‘బిల్ట్ ఆన్ మెటా లయామ 3’ అనేది ఇప్పటి వరుకు ఉన్న వాటిల్లో చాలా పవర్ఫుల్ అడ్వాన్సుడ్ మోడల్.