iDreamPost

ఫైనల్​లో కీలకం కానున్న టాస్.. ఈ పిచ్​పై ఎంత కొడితే సేఫ్!

  • Author singhj Published - 10:14 PM, Fri - 17 November 23

భారత్-ఆసీస్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్​లో టాస్ కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పిచ్​పై ఎంత స్కోరు కొడితే సేఫ్ అనేది ఇప్పుడు చూద్దాం..

భారత్-ఆసీస్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్​లో టాస్ కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పిచ్​పై ఎంత స్కోరు కొడితే సేఫ్ అనేది ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 10:14 PM, Fri - 17 November 23
ఫైనల్​లో కీలకం కానున్న టాస్.. ఈ పిచ్​పై ఎంత కొడితే సేఫ్!

వరల్డ్ కప్-2023​ ఆఖరి దశకు చేరుకుంది. ఇంకో మ్యాచ్ పూర్తయితే మెగా టోర్నీ ముగుస్తుంది. ఇప్పటిదాకా ఎన్నో హోరాహోరీ మ్యాచులు, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​తో క్రికెట్ లవర్స్, ఫ్యాన్స్​ను అలరించింది ప్రపంచ కప్. ఇక, అసలైన మజా ఇప్పుడు రానుంది. కప్పు కొట్టేసేందుకు ఆఖరి మ్యాచ్​లో బరిలోకి దిగుతున్నాయి ఫేవరెట్స్ ఆస్ట్రేలియా, ఇండియా. ఈ రెండు టీమ్స్ మధ్య లీగ్ స్టేజ్​లో జరిగిన మ్యాచ్​లో రోహిత్ సేనదే పైచేయి అయింది. ఆ మ్యాచ్​లో ఆసీస్​ను కుమ్మేసిన భారత్.. ఆ తర్వాత వరుస విజయాలతో సెమీస్​కు చేరుకుంది. రికార్డులు భయపెడుతున్నా, తీవ్ర ఒత్తిడిలోనూ న్యూజిలాండ్​కు నాకౌట్ పంచ్ ఇచ్చింది. దీంతో దర్జాగా ఫైనల్​కు చేరుకొని మూడోసారి వరల్డ్ కప్ అందుకోవడంపై కన్నేసింది.

ఫైనల్​ చేరుకోవడం వరకు భారత్ స్టోరీ నల్లేరు మీద నడకలా సాగిందని అనిపించొచ్చు. కానీ వరల్డ్ కప్ ముందు వరకు టీమిండియా ఎన్నో సమస్యలతో సతమతమైంది. ప్లేయర్ల ఇంజ్యురీలు, ఫామ్​తో ఇబ్బంది పడింది. అయితే ఆసియా కప్-2023తో అన్ని ప్రాబ్లమ్స్​కు పరిష్కారం దొరికింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​తో మరింత స్ట్రాంగ్ అయిన టీమిండియా.. వరల్డ్ కప్​లో దుమ్మురేపుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​ను సూపర్ స్ట్రాంగ్ చేసుకొని.. పక్కా ప్లాన్​తో ఆడుతూ ఫైనల్​కు రీచ్ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా స్టోరీ వేరేలా ఉంది. మొదట్లో వరుస ఓటములతో ఇబ్బంది పడింది కంగారూ టీమ్.

వరుస ఫెయిల్యూర్స్​తో ఇబ్బంది పడినా ఆ తర్వాత ట్రాక్​లోకి వచ్చింది ఆసీస్. ఒక్కో విజయం సాధిస్తూ సెమీస్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది. లీగ్ స్టేజ్ ఎండింగ్​కు వచ్చేసరికి డేంజరస్ టీమ్​గా మారింది. నాకౌట్ మ్యాచ్​లోనూ సౌతాఫ్రికాను తక్కువ రన్స్​ ఆలౌట్ చేసింది. ఛేజింగ్​లో తడబడినా ఆఖరి వరకు పోరాడి గెలిచింది. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్​కు చేరుకున్న ఈ రెండు టీమ్స్ మధ్య ఫైనల్ ఫైట్ అంటే మామూలుగా ఉండదు. అయితే ఈ మ్యాచ్​లో పిచ్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్​ పిచ్ సాధారణంగా బ్యాటింగ్​కు అనుకూలిస్తుంది. కానీ ఫైనల్ మ్యాచ్​ కోసం పిచ్​ను కాస్త మార్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బౌలింగ్ ఫ్రెండ్లీగా పిచ్​ను సిద్ధం చేస్తున్నారని టాక్.

ఈ విషయంపై అహ్మదాబాద్ పిచ్ క్యురేటర్ తాజాగా రియాక్ట్ అయ్యాడు. ‘ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 315 రన్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ స్కోరును డిఫెండ్ చేయడం సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు చాలా కష్టంగా మారుతుంది’ అని క్యురేటర్ చెప్పారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే టాస్ కీలకంగా మారుతుంది. టాస్ నెగ్గిన టీమ్ మొదట బ్యాటింగ్​ను ఎంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 ప్లస్ స్కోరు నమోదు చేసి.. ఛేజింగ్​లో త్వరగా వికెట్లు తీస్తే ప్రత్యర్థి టీమ్ పూర్తిగా డిఫెన్స్​లో పడిపోయే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ టాస్ నెగ్గితే మ్యాచ్ గెలిచేసినట్లేనని అంటున్నారు. మరి.. ఫైనల్​లో టాస్ ఎంత వరకు కీలకం అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మనకే కాదు ఆస్ట్రేలియాకూ ఒక హిట్​మ్యాన్ ఉన్నాడు.. ఫైనల్​లో ఏం చేస్తాడో..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి