iDreamPost

Tollywood Sankranthi : సంక్రాంతి ఎంటర్ టైన్మెంట్ ఇన్ని కోట్లేనా

Tollywood Sankranthi : సంక్రాంతి ఎంటర్ టైన్మెంట్ ఇన్ని కోట్లేనా

రేపటి నుంచి సినిమా సంక్రాంతి మొదలు కాబోతోంది. మాములుగా అయితే ఈ టైంలో ఓ రేంజ్ హడావిడి ఉండాలి. కానీ దానికి భిన్నంగా బాక్సాఫీస్ చప్పగా ఉంది. ఒక్క బంగార్రాజు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ తో పర్వాలేదనిపిస్తుండగా రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చిల మీద జనం ఏమంత ఆసక్తి చూపించడం లేదు. చాలా బాగున్నాయని టాక్ వస్తే తప్ప వీటి థియేటర్లలో జనం నిండుగా కనిపించడం కష్టం. ఓమిక్రాన్ భయం పబ్లిక్ లో బాగానే పెరుగుతోంది. బయట తిరుగుతున్నారు కానీ సినిమాల విషయంలో మాత్రం రిస్క్ తీసుకోవడానికి అంతగా ఇష్టపడుతున్నట్టు కనిపించడం లేదు. దాని ఫలితమే వీక్ గా సాగుతున్న ఆన్ లైన్ బుకింగ్స్.

ఇక బిజినెస్ సంగతి చూస్తే బంగార్రాజు వరల్డ్ వైడ్ అంతా కలిపి 39 కోట్ల రూపాయలకు డీల్ చేసుకున్నట్టు తెలిసింది. అంటే నలభై కోట్ల షేర్ వస్తే సేఫ్ అయినట్టే. రౌడీ బాయ్స్ ని 12 కోట్ల దాకా అమ్మారట. నిర్మాత దిల్ రాజు కావడంతో డెబ్యూ హీరోకి ఇది పెద్ద మొత్తమే అయినా డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చారు. టాలీవుడ్ టాప్ హీరోలందరినీ తీసుకొచ్చి ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఇక గల్లా అశోక్ హీరోకి 8 కోట్ల దాకా వ్యాపారం అయ్యిందట. ఎవరూ పట్టించుకోని సూపర్ మచ్చిని 5 కోట్లకు అమ్మారని వినికిడి. ఈ నాలుగు కలుపుకున్నా మొత్తం కలిపి 65 కోట్లే అవుతుంది. మొన్న నిన్నటి ఏడాది ఒక్కో సినిమానే ఇంతేసి రేంజ్ లో బిజినెస్ చేసుకున్నాయి.

పైకి ఫిగర్ ఈజీగానే కనిపిస్తున్నప్పటికీ అనుకున్నంత సులభంగా ఇవి కలెక్షన్స్ గా మారవు. బంగార్రాజుకు పాజిటివ్ టాక్ వస్తే దూసుకుపోతుంది. మొదటిరోజే పది కోట్ల గ్రాస్ ఖాయమని అంటున్నారు. అదే ఊపు కొనసాగిస్తే పది రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఖాయం. కానీ రౌడీ బాయ్స్ తో పాటు మిగిలిన సినిమాలు కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఎగ్జిబిటర్ల ఆశలన్నీ కరెంట్ బుకింగ్ మీదే ఉన్నాయి. నేరుగా వచ్చి టికెట్లు కొనే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారని భావిస్తున్నారు. ఇంత పెద్ద పండక్కు నాలుగు సినిమాలు కలిసి 65 కోట్లే చేయడం గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడనిది విననది. ఇంకెలాంటి విచిత్రాలు చూడాల్సి వస్తుందో లెట్ సి

Also Read : Tips : తెలుగు సినిమా సంగీతానికి డిమాండ్ అలాంటిది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి