iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీ ఉగిపోయేలా బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్!

  • Published Jul 17, 2024 | 6:56 PM Updated Updated Jul 17, 2024 | 6:56 PM

Balakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆగ్రకథనాయికులుగా ఎవరైనా, ఏదైనా ఘనత సాధిస్తే వాటిని బాగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ లో కూడా సెప్టెంబరులో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. కాగా, అందులో నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఓ ఈవెంట్ ఫ్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

Balakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆగ్రకథనాయికులుగా ఎవరైనా, ఏదైనా ఘనత సాధిస్తే వాటిని బాగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ లో కూడా సెప్టెంబరులో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. కాగా, అందులో నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఓ ఈవెంట్ ఫ్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Jul 17, 2024 | 6:56 PMUpdated Jul 17, 2024 | 6:56 PM
ఇండస్ట్రీ ఉగిపోయేలా బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్!

చిత్ర పరిశ్రమ అనేది ఎంతోమంది మహానభావులను పరిచయం చేసింది. మరెందరో నటులను గొప్ప నటులుగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే.. సాధరణ నటులుగా తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన నటులెందరో ఇండస్ట్రీలో తమ చరిత్రను తామే లిఖించుకుంటున్నారు. అంతేకాకుండా.. ఇప్పుడు జనరేషన్ కూడా చెప్పుకునే విధంగా ఇన్సిఫిరేషన్ గా నిలుస్తున్నారు. మరి అలాంటి వారిలో ఆగ్ర కథనాయుకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఈయన తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. గమన్హారమైన విషయేమేటంటే.. ఈయన బాలనటుడిగానే తెలుగునాట రంగ ప్రవేశం చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన నటనతో.. విభిన్న కథలతో నేటి యూత్ లో ఆయనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నారు. ఇక ఈయన సినిమాలు థియేటర్లలో విడుదలైతే చాలు పునకాలే. అంతాలా ఎన్టీఆర్ వారసుడిగా తనకంటూ ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఓ మార్క్ ను వేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఆగ్రకథనాయికులుగా ఎవరైనా, ఏదైనా ఘనత సాధిస్తే వాటిని బాగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా సెప్టెంబరులో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. కాగా, అందులో నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఓ ఈవెంట్ ఫ్లాన్ చేస్తున్నారు.ఇక ఆ సెలబ్రేషన్స్ కు సంబంధించి అనుమతులు కూడా వచ్చేశాయట. ఇకపోతే బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ జులై నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. అయితే ఆయన బాలనటుడిగా  తొలి సినిమా ‘తాతమ్మ కల’ ఆగస్టు 30, 1974న విడుదలైంది. ఇక అప్పటి నుంచి బాల నటుడిగా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత హీరోగా మారి తన సినీ ప్రయాణాన్ని సుధీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

అంతేకాకుడా.. మరో పక్క తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. ఇకపోతే సినిమాల్లో, రాజకీయాల్లో తండ్రిలా ఎదిగిన బాలకృష్ణ సామాజిక సేవల్లో కూడా పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటుంటారు. ముఖ్యంగా..   బసవతారకం పేరుతో  క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌గా సేవా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. కనుక ఇన్ని ఘనతల సాధించిన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ బాలకృష్ణను  సెప్టెంబరు 1న ఘనంగా సన్మానించనుంది. ఈ మేరకు  తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్ (K L Damodar Prasad) , తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్‌ నారంగ్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ బాలకృష్ణని కలిశారట.

ఈ క్రమంలోనే ఆయనను సన్మానం చేయాలని అనుకుంటున్నామని,  ఓకే అంటే వేడుక ఏర్పాటుకు అన్నీ సిద్ధం చేస్తాం అని అడిగి, అంగీకారం తీసుకున్నారట. ఇక ఈ సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరవుతారట. తాజాగా ఈ విషయంపై  టి.ప్రసన్నకుమార్‌ ఓ ప్రకటనలో విడుదల చేశారు. అలాగే  భారీ స్థాయిలో ఈ వేడుకలకు పనులు ఉంటాయట. త్వరలో మరిన్ని విషయాలు తెలియనున్నాయి. ఇదిలా ఉంటే..  ప్రస్తుతం బాలకృష్ణ బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయనున్నారట. ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో కూడా బాలయ్యకు ఓ సినిమా ఉంటుందని సమాచారం. మరి, బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా త్వరలోనే  సెలబ్రేషన్స్ నిర్వహించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş