iDreamPost
android-app
ios-app

Shiva Kartikeyan: ఘనంగా హీరో శివ కార్తికేయన్ కుమారుడి బారసాల.. ఏం పేరు పెట్టారో తెలుసా?

  • Published Jul 15, 2024 | 3:15 PM Updated Updated Jul 15, 2024 | 3:15 PM

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. కాగా, ఇటీవలే శివకార్తికేయన భార్య ఆర్తి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఆ బిడ్డకు శివకార్తికేయన్ దంపతులు నామకరణం పెట్టి బాలసార చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను శివకార్తికేయన్ పోస్టు చేసి ఓ ఎమోషనల్ పోస్టు చేశాడు.

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. కాగా, ఇటీవలే శివకార్తికేయన భార్య ఆర్తి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఆ బిడ్డకు శివకార్తికేయన్ దంపతులు నామకరణం పెట్టి బాలసార చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను శివకార్తికేయన్ పోస్టు చేసి ఓ ఎమోషనల్ పోస్టు చేశాడు.

  • Published Jul 15, 2024 | 3:15 PMUpdated Jul 15, 2024 | 3:15 PM
Shiva Kartikeyan: ఘనంగా హీరో శివ కార్తికేయన్ కుమారుడి బారసాల.. ఏం పేరు పెట్టారో తెలుసా?

కోలీవుడ్ యంగ్ హీరో ‘శివ కార్తికేయన్’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. పేరుకి తమిళ నటుడు అయిన ఈ హీరోకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఈ క్రమంంలోనే ఎన్నో విభిన్న పాత్రల్లో అలరిస్తూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల క్రితం ఈ హీరో త్వరలో ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్నడనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఈ హీరో తండ్రిగా ప్రమోషన్ కూడా పొందాడు. కాగా, అతని భార్యఆర్తి గతనెల జూన్ 2వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే ఈ శివకార్తికేయన్ దంపతులకు ఇప్పటికే కూతురు ఆరాధన, కుమారుడు గుగున్ ఉన్నారు. ఇక ముచ్చటగా మూడోసారి అబ్బాయి పుట్టాడు.దీంతో ఈ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే… తాజాగా శివకార్తికేయన్ దంపతులు తన కుమారుడికి బారసాల నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా తమ అబ్బాయికి నామకరణం చేశారు. అనంతరం బారసాలకు సంబంధించిన వీడియోలను ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శివకార్తికేయన్ తమ కుమారుడికి పవన్ అనే నామకరణం చేశారు. అలాగే ఆ బారసాలకు సంబంధించిన వీడియోలో షేర్ చేస్తూ అందులో తన భార్య పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుని ఇలా ఎమోషనల్ అయ్యాడు. ‘ఆర్తి.. ఆపరేషన్‌ థియేటర్‌లో పిల్లల్ని కనేటప్పుడు నువ్వు ఎంత నరకం చూశావో నేను నా కళ్లారా చూశాను. అలాగే ఆ బాధను భరిస్తూ నాకు అందమైన ప్రపంచాన్ని ఇచ్చావ్.  అందుకు నేను నీకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. లవ్యూ’ అని తన భార్యపై ప్రేమను కురిపించాడు శివకార్తికేయన్.  ఇక ఈ వీడియో చివర్లో ఆరాధన- గుగన్‌ – పవన్‌ అంటూ తన ముగ్గురి పిల్లల పేర్లు ప్రస్తావించాడు.

ఇక ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శివ కార్తికేయన్ దంపతులకు పెద్ద ఎత్తునే శుభకాంక్షలు తెలిపారు. అంలాగే శివకార్తికేయన్ ఫ్యామిలీ ఎంతో క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే శివకార్తికేయన్ కు తమ దగ్గరి బంధువు అమ్మాయి అయిన ఆర్తిని 2010లో వివాహం చేసుకున్నారు. కాగా, వీరికి 2013లో ఆరాధన అనే పాప జన్మించగా, 2021లో గుగున్ అనే బాబు జన్మించాడు. కాగా, మళ్లీ ఇప్పుడు మూడోసారి పవన్ అనే బాబు జన్మించాడు. మరి, శివకార్తతికేయన్ పోస్టు చేసిన వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş