iDreamPost
android-app
ios-app

Kartikeya: ప్రణీత్ హనుమంతు ఘటనపై స్పందించిన కార్తికేయ! తప్పు చేశానంటూ!

  • Published Jul 09, 2024 | 4:07 PM Updated Updated Jul 09, 2024 | 4:07 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబర్ ప్రణీత్ పై సామాన్య నెటిజన్స్ దగ్గర నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు వరకు విమర్షల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హీరో కార్తికేయ ప్రణీత్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబర్ ప్రణీత్ పై సామాన్య నెటిజన్స్ దగ్గర నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు వరకు విమర్షల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హీరో కార్తికేయ ప్రణీత్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారింది.

  • Published Jul 09, 2024 | 4:07 PMUpdated Jul 09, 2024 | 4:07 PM
Kartikeya: ప్రణీత్ హనుమంతు ఘటనపై స్పందించిన కార్తికేయ! తప్పు చేశానంటూ!

ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలపై అసభ్యరకర వ్యాఖ్యలు చేసిన హనుమంతుపై సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతిఒక్కరూ విమర్శల వర్షం కురుపిస్తున్నారు. ఎందుకంటే.. వావి వరసలు మర్చి తండ్రీ కూతుళ్ల అనుబంధంపై అతను చేసిన వ్యాఖ్యలు నీచంగా ఉండటంతో.. ఇటు రాజకీయ,క్రీడా ప్రముఖులు కూడా ఖండిస్తూ అతని పై మండిపడుతున్నారు. ఇకపోతే ప్రణీత్ ఒక కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాకుండా.. కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా నటించాడు. అలాగే కంటెంట్ క్రియటెర్ గా కొందరీ స్టార్స్ ను కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోని యంగ్ హీరో ‘కార్తికేయను’ కూడా ‘భజే వాయువేగం’ సినిమా కోసం ఫన్మంతు అనే యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో హనుమంతుతో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారు. అయితే తాజాగా దీనిపై స్పందిచిన హీరో కార్తికేయ తాను ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇవ్వాల్సిందంటూ ఓ ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, ఆ వివరాళ్తలోకి వెళ్తే..

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇటీవలే భజే వాయువేగం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు ముందు కార్తికేయ ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ సినిమాకు ఇంటర్య్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం పై కార్తికేయ స్పందించి అతనికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉంటే బాగున్ను అని సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కార్తీక పోస్టులో ఇలా రాసుకొచ్చాడు. ‘నేను ప్రణీత్ హనుమంతు యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ, ఆ ఇంటర్వ్యూ కేవలం నా భజే వాయువేగం సినిమాలో ప్రమోషన్లలో భాగం మాత్రమే. ఇకపోతే ఇతర ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టే ఈ ప్రణీత్ హనుమంత్ సినిమాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే అక్కడ వాళ్లు  అడిగిన కొన్ని ప్రశ్నలు నాకు కాస్త షాకింగ్‍గా అనిపించాయి. కానీ, అక్కడ గొడవలు వద్దనుకొని నేను అనుకున్నాను. అందుకే వీలైనంత స్పోర్టివ్‍గా ఉండాలనుకుని ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది.

అలాగే ఒక హీరోగా నా సినిమాను జనాళ్లోకి తీసుకెళ్లే బాధ్యతల్లో భాగంగానే ఇంటర్వ్యూ ఇచ్చాను. అంతే తప్పా అలాంటి కంటెంట్ ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం మాత్రం కాదు. కానీ, నేను ఆ ఛానెల్ ఇంటర్వ్యూలో భాగమైనందుకు చాలా బాధపడుతున్నాను.ఇక ఇప్పటి నుంచి నేను ఇలాంటి ఇంటర్వ్యూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను . ఎందుకంటే.. మనం అలాంటి కంటెంట్‍ను ఎంకరేజ్ చేయకూడదు. ఇక అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’ అంటూ కార్తికేయ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, హీరో  కార్తికేయ ప్రణీత్ హనుమంతు యుట్యూబ్ ఛానెల్  పై చేసే కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet