సంక్రాంతికి చెప్పుకోదగ్గ పోటీ లేకుండా మల్టీ స్టారర్ గా విడుదలైన బంగార్రాజు అనూహ్యంగా నెమ్మదించింది. ఏపిలో సగం ఆక్యుపెన్సీ, సెకండ్ షోల రద్దు లాంటి కారణాలు ఉన్నప్పటికీ ఇటు నైజామ్ లోనూ అంతే స్థాయిలో డ్రాప్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా రాబట్టిన షేర్ సుమారు 30 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్. అంటే బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకో పది కోట్ల దాకా రావాలి. ఈ శుక్రవారం కూడా చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడం బంగార్రాజుకు కలిసొచ్చే […]
ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం బంగార్రాజుకి బాగా కలిసి వస్తోంది. ఇండస్ట్రీ రికార్డులు కాదు కానీ నాగార్జున నాగ చైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ నెంబర్స్ ని నమోదు చేసే దిశగా పరుగులు పెడుతోంది. శుక్రవారంతో మొదలుపెట్టి నిన్నటిదాకా ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు వేసుకున్న ఈ ఎంటర్ టైనర్ కు మొదటి వారం చాలా కీలకంగా మారనుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా దక్కించుకున్న […]
పండక్కి కొత్త అల్లుడు వస్తాడేమో కానీ, బంగార్రాజు మాత్రం పాత అల్లుడే. సొగ్గాడే చిన్నినాయనేకి సీక్వెల్గా వచ్చింది. కొత్తదనమేమీ లేకుండా దాన్నే మళ్లీ తీసారు. నాగార్జునకి బదులు నాగచైతన్య వున్నాడు. పాత బంగార్రాజు అలాగే వుంటాడు. ఈయన మనుమడు బంగారురాజు. సినిమా ప్రారంభంలో ఎవరో దుండగులు నిధి కోసం శివలింగాన్ని పెకలించడం, చంద్రముఖిలో వున్నటు వంటి గ్రాఫిక్స్ పాము వాళ్లని వెంటబడి తరమడంతో కథ మొదలవుతుంది. పార్ట్ వన్లో నరకం నుంచి భూలోకానికి వచ్చిన నాగార్జున ఈ […]
రేపటి నుంచి సినిమా సంక్రాంతి మొదలు కాబోతోంది. మాములుగా అయితే ఈ టైంలో ఓ రేంజ్ హడావిడి ఉండాలి. కానీ దానికి భిన్నంగా బాక్సాఫీస్ చప్పగా ఉంది. ఒక్క బంగార్రాజు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ తో పర్వాలేదనిపిస్తుండగా రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చిల మీద జనం ఏమంత ఆసక్తి చూపించడం లేదు. చాలా బాగున్నాయని టాక్ వస్తే తప్ప వీటి థియేటర్లలో జనం నిండుగా కనిపించడం కష్టం. ఓమిక్రాన్ భయం పబ్లిక్ లో బాగానే పెరుగుతోంది. […]
ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వస్తున్నాయి. ఉన్న ఒక్క డబ్బింగ్ నా పేరు శివ 2 ఆల్రెడీ తప్పుకోవడంతో గ్రౌండ్ ఇంకాస్త ఫ్రీ అయ్యింది. అయితే వీటిలో ఒక సారూప్యత ఎన్నడూ లేనంత వెరైటీగా కనిపిస్తోంది. అదే వారసత్వం. బంగార్రాజులో పేరుకు నాగార్జున హీరోగా కనిపిస్తున్నా నిజానికి టైటిల్ రోల్ నాగ చైతన్యది. మాస్ లో తను ఈసారి బలంగా ఎస్టాబ్లిష్ అవుతాడన్న నమ్మకం అన్నపూర్ణ టీమ్ లో ఉంది. దానికి తగ్గట్టే […]
ఇంకో నాలుగు రోజుల్లో అక్కినేని నాగార్జున నాగ చైతన్య కలిసి థియేటర్లకు వచ్చి బంగార్రాజుతో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. తెలుగు ప్రేక్షకులకు ఫస్ట్ పండగ ఛాయస్ గా ఇదే నిలుస్తోంది. కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. నిర్మాణ సంస్థలు జీ అన్నపూర్ణలు ముందు అనుకున్న రేట్ కంటే కాస్త ఎక్కువే చెప్పినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి మరీ కొనేసుకున్నారని సమాచారం. గత కొన్నేళ్లుగా నాగ్ సినిమాలు బాక్సాఫీస్ […]
సంక్రాంతి వచ్చేస్తోంది. సినిమా సంబరాలకు మూవీ లవర్స్ రెడీ అవుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఉండే ఉత్సాహం మాత్రం ఈసారి అంత స్థాయిలో లేదు. కారణం ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల వాయిదానే. నాగార్జున బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదన్న మాట వాస్తవం. ఇక 14న ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నా కూడా కిక్ మాత్రం తక్కువే అనే చెప్పాలి. నాగార్జున రేస్ లో ఉన్నా కూడా మరికొన్ని మీడియం బడ్జెట్ మూవీస్ […]
సంక్రాంతి సీజన్ ని ఏదేదో ఊహించుకుంటే ఓమిక్రాన్ పుణ్యమాని ఏదేదో అవుతోంది. భారీ సినిమాలతో కిక్కిరిసిపోయే హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడిని కోరుకున్న బాక్సాఫీస్ వద్ద ఈసారి చిన్న సినిమాల పోటీతో సర్దుకుంటోంది. నాగార్జున బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ భారీ చిత్రం ఇంకేదీ లేదు. డిజె టిల్లు, రౌడీ బాయ్స్ వెనుక పెద్ద బ్యానర్లు ఉన్నాయి కానీ మౌత్ టాక్ బాగా వస్తే తప్ప జనం వీటి వైవు చూసే అవకాశాలు తక్కువ. కాకపోతే హాలిడే సీజన్ […]