iDreamPost

వీడియో: బీచ్ లో సరదాగా గడుపుతున్న జంట.. అంతలోనే రాకాసి అల..!

Viral Video Of Couple On Russia Sochi Beach: బీచ్ కి వెళ్లే వరకు సరదాగానే ఉంటుంది. కానీ, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం సముద్ర తీరాలు అంటే కంగారు పుడుతుంది. ఈ ఘటన కూడా అలాంటిదే.

Viral Video Of Couple On Russia Sochi Beach: బీచ్ కి వెళ్లే వరకు సరదాగానే ఉంటుంది. కానీ, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం సముద్ర తీరాలు అంటే కంగారు పుడుతుంది. ఈ ఘటన కూడా అలాంటిదే.

వీడియో: బీచ్ లో సరదాగా గడుపుతున్న జంట.. అంతలోనే రాకాసి అల..!

చల్లని సాయంత్రం వేళ.. సూర్యా స్తమయాన్ని చూస్తూ ప్రకృతిని ఆశ్వాదించడం అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ, బీచ్ దగ్గర ఉన్నప్పుడు కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహ్లాదం కోసం వెళ్లిన ట్రిప్పు విషాదం అయ్యే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రకృతిని మనం ఎప్పుడూ నమ్మలేం. ముఖ్యంగా సముద్రాలను అస్సలు నమ్మలేం. అవి అప్పటికి అప్పుడు ప్రశాంతంగానే కనిపిస్తాయి. కానీ, ఒక్కసారిగా ప్రళయంగా మారతాయి. అలాంటి ఒక ఘటనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒక జంట సముద్రం ఒడ్డున సరదాగా గడుపుతుంటే.. ఒక రాకాసి అల లాగేసుకెళ్లింది.

బీచ్ కి వెళ్లి సేదతీరాలి అని.. సరదాగా గడపాలి అని అందరికీ ఉంటుంది. ఈ జంట కూడా అలాగే సరదాగా కలిసి బీచ్ కి వెళ్లారు. అక్కడ మిగిలిన వాళ్లు కూడా ఎవరూ లేరు. అక్కడ కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ అలలు వస్తుంటూ ఆశ్వాదిస్తున్నారు. అయితే వాళ్లు చాలా బయటకే ఉన్నారు. నీళ్లు కేవలం వాళ్ల గిలకల వరకు మాత్రమే వస్తున్నాయి. అయితే ఒక్కసారిగా సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. అక్కడికక్కడే పెద్ద పెద్ద అలలు వచ్చేశాయి. ముందుగా వారి నముడుల లోతు వరకు నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా జంటలో ఉన్న అమ్మాయి సముద్రంలోకి కొట్టుకుపోయింది.

అక్కడే ఉన్న ఆమె ప్రియుడు కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ, ఆమెను కాపాడలేకపోయాడు. తర్వాత ఆ యువతి కోసం సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. యువతి కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారంట. అయితే ఈ సెర్చ్ గత మూడ్రోజులుగా జరుగుతున్నట్లు వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. అంటే ఈ ఘటన జరిగి మూడ్రోజులు కావొస్తోంది. వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన రష్యాలోని సోచీ నగరంలో జరిగినట్లు వీడియో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన కాలిన్ రగ్ అనే యూజర్ తెలిపారు. ఆయన ప్రొఫైల్లో అతను ఇన్వెస్టర్, ట్రెండింగ్ పాలిటిక్స్ కో ఓనర్ అని మెన్షన్ చేశారు. ఈ దృశ్యాలు చూసిన యూజర్స్ అంతా షాకవుతున్నారు. కొందరైతే అసలు సముద్రానికి వెళ్లాలి అంటేనే భయంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి