iDreamPost

వీడియో: లక్ అంటే ఈమెదే.. పక్కనే పిడుగు పడినా కూడా..!

Girl Escaped From A Lightning Strike: మీరు సోషల్ మీడియాలో చాలానే వీడియోలు చూసుంటారు. చాలామంది తృటిలో ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. ఈ వీడియో కూడా అలాంటి కోవకు చెందిందే. ఒక అమ్మాయి జస్ట్ సెకన్లలో ప్రాణాలతో బయటపడింది.

Girl Escaped From A Lightning Strike: మీరు సోషల్ మీడియాలో చాలానే వీడియోలు చూసుంటారు. చాలామంది తృటిలో ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. ఈ వీడియో కూడా అలాంటి కోవకు చెందిందే. ఒక అమ్మాయి జస్ట్ సెకన్లలో ప్రాణాలతో బయటపడింది.

వీడియో: లక్ అంటే ఈమెదే.. పక్కనే పిడుగు పడినా కూడా..!

మీరు సోషల్ మీడియాలో చాలానే వైరల్ వీడియోలు చూసుంటారు. చాలా మంది రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయట పడుతూ ఉంటారు. అయితే చాలా మంది అలాంటి వీడియోలు చూసి వారికే ఆ ప్రమాదం జరిగిందేమో అనేంతలా ఫీలవుతారు. ఇప్పుడు చెప్పుకునే ప్రమాదం గురించి తెలుసుకుంటే కూడా.. దాదాపుగా మీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే చూడటానికే గుండెలు ఆగిపోయినంత పని అవుతుంది. అది అలాంటి ఇలాంటి వీడియో కాదు.. పక్కనే పిడుగు పడిన వీడియో. అది ఎంతో స్పష్టంగా మనకు కనిపించింది కూడా. ఇంక ఆ అమ్మాయి ముఖ చిత్రమైతే చెప్పుకోవాల్సిన అవరమే లేదు.

ఇప్పుడు వర్షాకాలం.. దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షాలతో పాటుగా ఉరుములు, పిడుగులు సర్వ సాధారణంగానే పడుతూ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏ రోజు ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందో ముందే చెప్తున్నారు. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. అలాంటి ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా ఇలాంటి వారి తీరు మాత్రం మారదు. అయితే ఈ ఘటన జరిగింది మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. ఈ షాకింగ్ ఘటన బిహార్ లో జరిగింది. ఒక అమ్మాయి వర్షంలో డ్యాన్సులు చేస్తుండగా పక్కనే పిడుగు పడింది.

గతంలో అంటే వర్షం పడగానే.. ఇళ్లలోకి పరిగెత్తే వాళ్లు. తలుపులు, కిటికీలు గట్టిగా గడి పెట్టేవాళ్లు. కానీ, ఈ రోజుల్లో మాత్రం వర్షం పడుతోంది అనగానే పిల్లలు, పెద్దలు అంతా సెల్ ఫోన్లు పట్టేసుకుంటున్నారు. వర్షాన్ని వీడియో తీయడం.. వర్షంలో గంతులేస్తూ రీల్స్ చేయడం చాలా కామన్ అయిపోయింది. బిహార్ లో ఈ అమ్మాయి కూడా అలాంటి పనే చేయబోయింది. వర్షం పడుతుంటే మిద్ద మీదకు వెళ్లి గంతులేస్తోంది. అయితే కాసేపటికే ఆమె పక్కనే పెద్ద పిడుగు పడింది. ఇంకేముంది.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసింది. ఆమెకు భూమి మీద నూకలు చాలా ఎక్కువే ఉన్నట్లున్నాయి.

అందుకే పక్కనే పిడుగు పడినా కూడా ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఒకటి కూడా కాదు.. రెండుసార్లు ఏదో పెద్ద బాంబు వేసినట్లుగా పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఆఖరికి దేవుడికి కూడా రీల్స్ అంటే కోపం వస్తోంది అని కొందరు అంటున్నారు. మరి కొంతమంది యమధర్మరాజు కాస్త బిజీగా ఉన్నాడు. అందుకే బతికిపోయావ్ అని హేళన చేస్తున్నారు. ఇంకొంతమంది ఆమెకు ఒక బెస్ట్ రీల్ దొరికింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. ఈ యువతి అదృష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి