iDreamPost
android-app
ios-app

70 ఏళ్ల బామ్మ పెట్రోల్ బంకులో పని చేస్తూ.. నేటి యువతకు ఆదర్శంగా

  • Published Jun 26, 2024 | 5:07 PM Updated Updated Jun 26, 2024 | 5:07 PM

సాధారణంగా ఏ ఇంట్లో అయినా కొంతమంది వృద్ధులు వయసు పెరుగుతున్న కొద్ది ఏ పని చేయడానికి ఇష్టపెట్టుకోరు. అలాగే ఇంట్లో వారి మీద ఆధారపడుతుంటారు. కానీ, తాజాగా ఓ వృద్ధురాలు చేస్తున్న పని మాత్రం ఇప్పుడు వృద్ధులకే కాదు, నేటి యువతకు చాలా ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఆ బామకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సాధారణంగా ఏ ఇంట్లో అయినా కొంతమంది వృద్ధులు వయసు పెరుగుతున్న కొద్ది ఏ పని చేయడానికి ఇష్టపెట్టుకోరు. అలాగే ఇంట్లో వారి మీద ఆధారపడుతుంటారు. కానీ, తాజాగా ఓ వృద్ధురాలు చేస్తున్న పని మాత్రం ఇప్పుడు వృద్ధులకే కాదు, నేటి యువతకు చాలా ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఆ బామకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Jun 26, 2024 | 5:07 PMUpdated Jun 26, 2024 | 5:07 PM
70 ఏళ్ల బామ్మ పెట్రోల్ బంకులో పని చేస్తూ.. నేటి యువతకు ఆదర్శంగా

నేటి తరం యువత సోషల్ మీడియా రీల్స్ అని, చెడు వసనాలని, ఆన్ లైన్ గేమింగ్స్ అంటూ సమాయన్ని వృధా చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ, ఏ ఒక్కరు కూడా కష్టపడి చదవడం, చదివిన చదువుకు న్యాయం చేస్తూ ఏదో ఒక ఉద్యోగం చేయడం వంటి ఆలోచనను పెట్టుకోవడం లేదు. పైగా ఏదైనా మార్గంలో డబ్బును ఈజీగా సంపాదించాలనే ఆలోచనలో ఉన్నారు తప్పా. శ్రమించి ఏ పని అయిన చేసి తల్లిదండ్రుల మీద ఆధారపడతమని ఏ ఒక్కరు అనుకోవడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే.. శ్రీ శ్రీ అన్నట్లు నేటి యువత పుట్టుకతోనే వృద్ధుల అయిపోయారు. ముఖ్యంగా చిన్న కష్టానికి కూడా అయాసపడేలా మారిపోతున్నారు. ఇక వీరిని చూస్తే.. వయసు మళ్లీన వృద్ధులు నయం అనిపిస్తుంటది.

ఎందుకంటే.. కొంతమంది వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా తమ పనిని తామే చేసుకుంటారు. పైగా వయసుతో సంబంధం లేకుండా ఏపనినైనా ఉత్సాహంగా, శ్రద్ధగా చేసుకుంటారు. తాజాగా ఇప్పుడు మనం చెప్పే మాటాలకు నిదర్శనంగా ఓ వృద్ధురాలి చేస్తున్న పని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఆ వృద్ధురాలు నేటి యువతకు చక్కని ఆదర్శం. మరి ఆ విరవరాళ్లోకి వెళ్తే.. సాధారణంగా కొంతమంది ఇంట్లో వయసు పెరిగిన వృద్ధులు ఏ పని చేసుకోలేక కుటుంబ సభ్యులు మీద ఆధారపడుతుంటారు. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటనలో  ఓ బామ్మ మాత్రం పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతూ జీవనం సాగిస్తోంది. పైగా తాను వృద్ధురాలిని కాబట్టి, తన బాధ్యతను తన పిల్లలు చూసుకుంటారులే, తాను ఏ పని చేయకపోయినా పర్వాలేదు అని భావించకుండా.. పని చేయడంలో కూడా ఆనందం ఉంటుందంటూ కష్టపడి పనిచేస్తుంది. ఈ క్రమంలోనే.. తన కాలు కష్టంతో జీవనం సాగిస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ బామ్మ చేస్తున్న పని అందరికి స్ఫూర్తిదాయకం. అలాగే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషలో మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఈ బామ్మ కేరళకు చెందిదని. పైగా 70 ఏళ్లు వయసున్న  మూలం కడక్‌లోని ఓ పెట్రోల్‌ బంకులో రాత్రింబవళ్లు పనిచేస్తూ.. ఎవరికీ భారం పడకుండా సొంతంగా జీవిస్తోంది. అయితే కేరళ ఫోటోగ్రాఫర్ పొన్ను సూర్య (@పొన్నుసూర్యర్) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బామకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు. పైగా ఆ వీడియోలో ఆ  70 ఏళ్ల ఓ వృద్ధురాలు పెట్రోల్ బంకులో వాహనాలకు పెట్రోల్ , డీజిల్ నింపుతున్నట్లు కనిపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ  4.2 మిలియన్ల మంది వీక్షించారు. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్స్  ఈ బామ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, 70 ఏళ్ల వయసులో కూడా ఎవరి మీద ఆధారపడకుండా పెట్రోల్ బంకులో ఆ వృద్ధురాలు పని చేస్తున్న వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ponnu Surya R Photography (@ponnusuryar)