iDreamPost

ఘోర రైలు ప్రమాదం.. 9 బోగీలు బోల్తా.. 70 మంది!

Russia Train Accident: కొన్ని నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రం జరిగిన కోరమాండల్ ఎక్స్ రైలు ప్రమాదం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సారి ఏకంగా 70 మందికి..

Russia Train Accident: కొన్ని నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రం జరిగిన కోరమాండల్ ఎక్స్ రైలు ప్రమాదం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సారి ఏకంగా 70 మందికి..

ఘోర రైలు ప్రమాదం.. 9 బోగీలు బోల్తా.. 70 మంది!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతి సమస్యలు, ఇతర సమస్యల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే చాలా మంది తీవ్ర గాయాలతో జీవితాంతం నరకం అనుభవిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రం జరిగిన కోరమాండల్ ఎక్స్ రైలు ప్రమాదం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.  వారం క్రితం కోల్ కత్తాలో ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 5 మంది మరణించారు. ఇవి మరుక ముందే వేరే ప్రాంతంలో ఘరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. 9బోగీలు పక్కకు పడిపోయాయి. ఈ ఘటన రష్యా దేశంలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..

బుధవారం రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  ఆ దేశంలోని  ఉత్తర కోమి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఇంటా పట్టణానికి సమీపంలో ఓ ప్యాసెంజర్  రైలు పట్టాలు తప్పింది.  ఈ ప్రమాదంలో 9 బోగీలు బోల్తా పడ్డాయని కోమి ప్రాంత గవర్నర్ వ్లాదిరమిర్ ఉయ్బా వెల్లడంచారు. ఇంటా అనే టౌన్  సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని గవర్నర్ ఉయ్బా తెలిపారు. అయితే 70 మందికి తీవ్ర గాయలైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ రైలు భోగీలు పక్కనే ఉన్న నదిలోకి కూడా పడిపోయాయి.

ఇక ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో దాదాపు 215 ప్రయాణికులు  ఉన్నారు.  ఇక ఈ ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక అధికారులు అక్కడి చేరుకున్నారు. అంతేకాక రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు మాత్రం అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇలా తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో జర్నీ చేసేందుకు జనాలు భయపడుతున్నారు. మరి.. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి