iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకున్నారు

  • Published Jun 25, 2024 | 5:41 PM Updated Updated Jun 25, 2024 | 5:41 PM

ఈ మధ్య కాలంలో కొన్ని పెళ్లిళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలు తరుచు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ పెళ్లిలో బిర్యానీలో లెగ్ పీస్ పడలేదంటూ వధువు, వరుడు కుటుంబీకులు కొట్టుకున్నారు.

ఈ మధ్య కాలంలో కొన్ని పెళ్లిళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలు తరుచు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ పెళ్లిలో బిర్యానీలో లెగ్ పీస్ పడలేదంటూ వధువు, వరుడు కుటుంబీకులు కొట్టుకున్నారు.

  • Published Jun 25, 2024 | 5:41 PMUpdated Jun 25, 2024 | 5:41 PM
వీడియో వైరల్: బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకున్నారు

ఇటీవల కాలంలో కొన్ని పెళ్లిళ్లు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోల్లో చూస్తే కొంతమంది వధు వరులు చిన్న చిన్న కారణాలకే తిట్టుకోవడం, ఒకరిని ఒకరు స్టేజ్ పై కొట్టుకోవడం, ముఖం మీద ఆహారాన్ని విసరడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే అవి సోషల్ మీడియాలో చూసే యూజర్స్ కు ఫన్నీగా అనిపించినా.. జరిగే వివాదం మాత్రం పెద్దదిగానే ఉంటుంది.. పైగా అది ఏ స్థాయిలో ముదిరిపోతుందంటే.. చివరికి పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితి ఏర్పాడుతుంది. అంతేకాకుండా.. పెళ్లిలో భోజనాలు బాగోలేవని, నాన్ వెజ్ పెట్టలేదని ఇలా రకరకాలుగా చాలామంది గొడవలు పడతుంటారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో మాత్రం అందుకు విచిత్రంగా జరిగింది.  కేవలం పెళ్లిలో పెట్టే బిర్యానిలో చికెన్ ముక్క పడలేదని బంధుమిత్రులు ఇష్టనుసరంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఓ పెళ్లి బిర్యానీ విషయంలో వధూవరుల కుటుంబం  మధ్య గొడవ జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే తమకు వడ్డించిన బిర్యానీలో ఒక్క చికెన్ లెగ్ పీస్ కూడా లేదని వరుడు తరుపు వారు కోపోద్రిక్తులై వధువు తరుపు వారిపై గొడవకు దిగారు. ఈ క్రమంలోనే బిర్యానీ విషయంలో ఇరు కుటుంబీకుల మధ్య మాటల వాగ్వాదం చివరికి కొట్టుకునే స్థాయికి చేరిపోయింది. పైగా ఈ ఘర్షణలో వివాహనికి వచ్చిన అతిథులు కూడా పాల్గొన్నుట్లు సమాచారం. అలాగే ఒకరిని ఒకరు దారుణంగా దూషించుకోవడమే కాకుండా.. కొట్టుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆ వీడియోలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఓ వ్యక్తి ప్లాస్టిక్ కుర్చుని మరొక వ్యక్తిపై విసిరినట్టు కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నవాబ్‌గంజ్‌లోని సర్తాజ్ మ్యారేజ్ హాల్‌లో జరిగినట్లు సమాచారం.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతుంది. ఇక ఈ గొడవ ఎంతకు ఆగకపోవడంతో విసుగు చెందిన వరుడు..  పందిట్లో ఈ పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించాడు. దీంతో అరగంట వరకు కొనసాగిన గొడవ ఒక్కసారిగా ఆగిపోయింది. పైగా వధువు కుటుంబ సభ్యులు వరుడిని తన మనసు మార్చుకునేలా ఒప్పించే ప్రయత్నం ప్రారంభించారు. ఇలా ఎట్టకేలకు ఆ పెళ్లితంతు సజావుగా సాగింది. మరి, పెళ్లిలో బిర్యానీ కోసం ఘర్షణ పడుతున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet