iDreamPost

పుష్పకు వర్సటైల్ యాక్టర్ మిస్ ?

పుష్పకు వర్సటైల్ యాక్టర్ మిస్ ?

 సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప నుంచి విజయ్ సేతుపతి వైదొలుగుతాడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అన్నాడో లేదో కానీ కరోనా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి మల్టీ లాంగ్వేజ్ ఆర్టిస్టులకు డేట్స్ సర్దుబాటు చేయడం పెద్ద తలనెప్పిలా మారబోతోంది. అందులోనూ విజయ్ సేతుపతి తమిళ్ లోనే చాలా బిజీ ఆర్టిస్ట్. ఉప్పెనకు సైతం చాలా కష్టం మీద షెడ్యూల్స్ ప్లాన్ చేశారని అప్పట్లోనే టాక్ వచ్చింది.

ఇప్పుడు చూస్తే కనీసం మూడు నెలల వరకు షూటింగులు తిరిగి మొదలయ్యే సిచువేషన్ కనిపించడం లేదు. ఇది దేశమంతా అన్ని బాషల సినిమా పరిశ్రమలకు వర్తిస్తుంది కాబట్టి పుష్ప సైతం దాన్ని ఫాలో కావాల్సిందే. అసలే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం. బల్క్ గా డేట్స్ అవసరం పడతాయి. మరోవైపు కోలీవుడ్ లో విజయ్ సేతుపతి చాలా కమిట్మెంట్స్ ఇచ్చాడు. వాటికీ తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే సుకుమార్ కు విజయ్ సేతుపతి ఫోన్ లోనే తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్టుగా వినికిడి. ఒకవేళ తప్పదు అనుకుంటే కన్నడ స్టార్ హీరో దర్శన్ కోసం సుకుమార్ ట్రై చేస్తున్నట్టుగా మరో వార్త ప్రచారంలో ఉంది.

పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్న మూవీ కాబట్టి స్టార్ క్యాస్టింగ్ ఎంత బలంగా ఉంటే అంత ప్లస్ అవుతుంది. అందుకే సుకుమార్ ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. దర్శన్ మన ప్రేక్షకులకు పరిచయం లేని మొహమే కానీ కన్నడలో ఇతనికి భారీ ఫాలోయింగ్ ఉంది. పెర్ఫార్మన్స్ పరంగానూ లుక్స్ విషయంలోనూ ఈగ సుదీప్ తరహాలో మంచి అవుట్ ఫుట్ ని ఆశించొచ్చు. కానీ ఇదంతా విజయ్ సేతుపతి పూర్తిగా పుష్ప నుంచి డ్రాప్ అయితేనే అమలులోకి వస్తుంది. అనిశ్చితి రాజ్యమేలుతున్న తరుణంలో పుష్పనే కాదు ఏ భారీ చిత్రం గురించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే పరిస్థితిలో యూనిట్లు లేవు. సో పుష్పలో విజయ్ సేతుపతి ఉంటాడా లేక దర్శన్ వస్తాడా అనేది తేలాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి