iDreamPost
android-app
ios-app

మహారాజ 2 వచ్చేస్తుందట…

  • Published Jun 20, 2025 | 3:08 PM Updated Updated Jun 20, 2025 | 3:08 PM

Maharaja Movie Sequel: విజయ్ సేతుపతి స్వతహాగా తమిళ నటుడే అయినా.. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ముఖ్యంగా సైరా , ఉప్పెన లాంటి సినిమాలు విజయ్ ను తెలుగువారికి మరింత చేరువ చేశాయి. ఆ తర్వాత నుంచి అతను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా అనువాదం అవుతున్నా

Maharaja Movie Sequel: విజయ్ సేతుపతి స్వతహాగా తమిళ నటుడే అయినా.. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ముఖ్యంగా సైరా , ఉప్పెన లాంటి సినిమాలు విజయ్ ను తెలుగువారికి మరింత చేరువ చేశాయి. ఆ తర్వాత నుంచి అతను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా అనువాదం అవుతున్నా

  • Published Jun 20, 2025 | 3:08 PMUpdated Jun 20, 2025 | 3:08 PM
మహారాజ 2 వచ్చేస్తుందట…

విజయ్ సేతుపతి స్వతహాగా తమిళ నటుడే అయినా.. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ముఖ్యంగా సైరా , ఉప్పెన లాంటి సినిమాలు విజయ్ ను తెలుగువారికి మరింత చేరువ చేశాయి. ఆ తర్వాత నుంచి అతను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా అనువాదం అవుతున్నాయి. వాటిలో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా గత ఏడాది థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన మహారాజ ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు.

థియేటర్ లో రిలీజ్ అయినప్పటికంటే కూడా ఓటిటి లో రిలీజ్ అయిన తర్వాత సినిమాకు ఇంకాస్త ఎక్కువ రెస్పాన్స్ దక్కింది. చాలా రోజులు ఈ మూవీ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ రేంజ్ లో ఏదైనా సినిమా హిట్ అందుకుంది అంటే కచ్చితంగా దానికి సిక్వెల్ ను ఆశిస్తున్నారు అభిమానులు. దీనితో ఇప్పుడు ఈ సినిమాకు కూడా ప్రేక్షకులు ఎప్పటినుంచో సిక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానిని ఇప్పుడు విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ నెరవేర్చబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మహారాజ సినిమాతోనే నిథిలన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా హిట్ అయ్యాక ఈ దర్శకుడికి చాలానే ఆఫర్లు వచ్చినా అతను కొత్తగా ఏ సినిమాలను ప్రకటించలేదట. ఇక ఇప్పుడు మరోసారి విజయ్ సేతుపతితోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహారాజ సిక్వెల్ స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయట. మరోవైపు విజయ్ సేతుపతి కూడా నిథిలన్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సిక్వెల్ ను అనౌన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి మూవీ భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.