iDreamPost
android-app
ios-app

నిర్మాతలను కీలుబొమ్మలుగా చేస్తున్న OTTలు

  • Published Jun 23, 2025 | 4:09 PM Updated Updated Jun 23, 2025 | 4:09 PM

టాలీవుడ్ ఒక్కప్పుడు హీరోల చేతుల్లో ఉండేది. ఆ తర్వాత స్లో గా దర్శకులు దానిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు చేతుల్లోకి వెళ్ళింది. అలా చేతులు మారుతూ వస్తున్న తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఓటిటి లకు బందీ కాబోతుందా ? అంటే నూటికి తొంబై శాతం అవును అనే అంటున్నారు.

టాలీవుడ్ ఒక్కప్పుడు హీరోల చేతుల్లో ఉండేది. ఆ తర్వాత స్లో గా దర్శకులు దానిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు చేతుల్లోకి వెళ్ళింది. అలా చేతులు మారుతూ వస్తున్న తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఓటిటి లకు బందీ కాబోతుందా ? అంటే నూటికి తొంబై శాతం అవును అనే అంటున్నారు.

  • Published Jun 23, 2025 | 4:09 PMUpdated Jun 23, 2025 | 4:09 PM
నిర్మాతలను కీలుబొమ్మలుగా చేస్తున్న OTTలు

టాలీవుడ్ ఒక్కప్పుడు హీరోల చేతుల్లో ఉండేది. ఆ తర్వాత స్లో గా దర్శకులు దానిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు చేతుల్లోకి వెళ్ళింది. అలా చేతులు మారుతూ వస్తున్న తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఓటిటి లకు బందీ కాబోతుందా ? అంటే నూటికి తొంబై శాతం అవును అనే అంటున్నారు. ఎప్పుడైతే కరోనా మొదలైందో అప్పుడు చాలా మంది జీవితాలు తలక్రిందులు అయ్యాయి. వాటిలో తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఒకటి. ఆ సమయంలో జనాలు ఇల్లకు పరిమితం అయ్యారు. దీనితో ఓటిటి లకు విపరీతమైన కంటెంట్ అవసరం ఏర్పడింది. అప్పటినుంచి ఓటిటి లు మరింత వేగం పుంజుకున్నాయి. ఒక సినిమా రిలీజ్ కాకముందే అడ్వాన్స్ లు ఇవ్వడం మొదలెట్టాయి. ఆ సమయంలో స్టార్ట్ చేసిన ఓటిటి గేమ్ ఇప్పుడు నిర్మాతలను తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది.

వాస్తవానికి ఒకప్పుడు నిర్మాతలు ఈ ఓటిటి ల నుంచి వచ్చే లాభాలను అంతగా పట్టించుకునేవారు కాదు. ముందు థియేట్రికల్ బిజినెస్ , తర్వాత శాటిలైట్ , ఆడియో బిజినెస్ లెక్కల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. అన్నిటికంటే ముందు అక్కడ ఓటిటి కర్చీఫ్ వేసుకుని కూర్చుంటుంది. థియేటర్లతో సమానంగా ఓటీటీ రాబడి ఉంటోంది.అవసరమైతే అదనపు పెట్టుబడులు పెడుతున్నాయి. అంతే కాదు నిర్మాతలతో బేరాలు ఆడుతున్నాయి. ఏకంగా బడా హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ సైతం ఓటిటి లే కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా కుభేర, హరి హర వీరమల్లు , కింగ్డమ్ సినిమాల విషయంలో ఏమి జరిగిందో తెలియనిది కాదు. ఒకప్పుడు సినిమాలు స్టార్ట్ చేయగానే కాంబినేషన్స్ చూసి అడ్వాన్స్ ఇచ్చిన ఓటిటిలు.. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ నే కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసింది.

ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే మేకర్స్ కు నష్టం తప్పదు. ఓ రకంగా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు ఇదొక డేంజర్ బెల్ లాంటిది.ఇకపై అగ్రిమెంట్స్ టైం లోనే ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఈ విషయంలో మేల్కొన్నారు. ఓటీటీలతో సంబంధం లేకుండా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఓటిటి ఆధిపత్యం పెరిగిపోతుంది. ఇది ఇలానే కొనసాగితే థియేటర్ల వ్య‌వ‌స్థ‌కు కచ్చితంగా ఇబ్బంది అని చెప్పాల్సిందే. ఇక ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis