iDreamPost

విజయ్‌ మాల్యా ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న కుమారుడు

  • Published Jun 18, 2024 | 11:38 AMUpdated Jun 18, 2024 | 11:38 AM

Vijay Mallya: ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ.. విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆ వివరాలు.

Vijay Mallya: ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ.. విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆ వివరాలు.

  • Published Jun 18, 2024 | 11:38 AMUpdated Jun 18, 2024 | 11:38 AM
విజయ్‌ మాల్యా ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న కుమారుడు

విజయ్‌ మాల్యా.. ఈ వ్యక్తి గురించి తులియన వారు మన దేశంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు దేశంలో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తిగా విజయ్‌ మాల్యా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతదేశంలో అతి పెద్దదైన స్పిరిట్స్‌ కంపెనీ యునైటెడ్‌ స్పిరిట్స్‌ మార్జీ ఛైర్మన్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు మాత్రమే కాక ఒకప్పుడు ఆర్సీబీ జట్టు యజమానిగా కూడా ఉన్నాడు. ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన విజయ్‌ మాల్యా.. ఆ తర్వాత అనేక ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొని.. చివరకు దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు.

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి.. దేశం విడిచి పారిపోయి.. యూకేలో తలదాచుకుంటున్నాడు విజయ్‌ మాల్యా. అతడిని ఇండియా రప్పించేందుకు అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. విజయ్‌ మాల్యా పేరు వినగానే.. ఆర్థిక నేరాలు, కేసులు ఇవే వార్తలు గుర్తుకు వస్తాయి. కానీ తొలిసారి అందుకు భిన్నమైన వార్తలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే విజయ్‌ మాల్యా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆ వివరాలు..

Vijay Malya

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యా ‌ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు సిద్ధార్థ మాల్యా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రియురాలు జాస్మిన్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని సిద్ధార్థ్‌-జాస్మిన్‌.. సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తన ప్రేయసికి ఉంగరం తొడిగి ప్రపోజ్‌ చేస్తోన్న ఫొటోని షేర్‌ చేశాడు సిద్ధార్థ్‌ మాల్యా.  ఇక ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా.. లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా.. అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు.. సిద్ధార్థ్‌-జాస్మిన్‌ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్‌ వేడుకలో భాగంగా సిద్ధార్థ్‌.. రింగ్‌ తొడిగి తన ప్రేమను వెల్లడించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్‌లో ఉన్నారు. జాస్మిన్‌ ఇన్‌స్టా బయోలో యూఎస్‌ అని ఉంది. ఆమె ప్రొఫైల్‌ను బట్టి చూస్తే.. మాజీ మోడల్‌గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్‌ కొన్నాళ్ల పాటు నటుడిగా, మోడల్‌గా రాణించాడు.

విజయ్‌ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతుల సంతాన సిద్ధార్థ్‌. కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌లో పుట్టి.. లండన్‌, యూఏఈలో పెరిగాడు. లండన్‌ రాయల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్‌ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్‌ తరఫున ఆర్సీబీ డైరెక్టర్‌గానూ వ్యవహరించిన సిద్ధార్థ్‌.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్‌ఫిషర్‌ మోడల్స్‌కు జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్‌ టాపిక్‌గా మారాడు. నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ కెరీర్‌లో మార్పు వచ్చింది. మెంటల్‌ హెల్త్‌ అవేర్‌నెస్‌ వైపు మళ్లిన సిద్ధార్థ్‌.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి