iDreamPost
android-app
ios-app

రోహిత్ కాదు.. ఇంగ్లండ్ భయమంతా ఆ ఒక్కడి గురించే! బట్లర్ కామెంట్స్

  • Published Jun 26, 2024 | 10:07 PM Updated Updated Jun 26, 2024 | 10:07 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భీకర ఫామ్​లో ఉన్నాడు. సూపర్ పోరులో ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకున్న హిట్​మ్యాన్.. సెమీస్​లోనూ జోరు చూపించాలని అనుకుంటున్నాడు. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ మాత్రం తమకు రోహిత్​తో కాదు.. అతడితోనే భయమని అంటున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భీకర ఫామ్​లో ఉన్నాడు. సూపర్ పోరులో ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకున్న హిట్​మ్యాన్.. సెమీస్​లోనూ జోరు చూపించాలని అనుకుంటున్నాడు. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ మాత్రం తమకు రోహిత్​తో కాదు.. అతడితోనే భయమని అంటున్నాడు.

  • Published Jun 26, 2024 | 10:07 PMUpdated Jun 26, 2024 | 10:07 PM
రోహిత్ కాదు.. ఇంగ్లండ్ భయమంతా ఆ ఒక్కడి గురించే! బట్లర్ కామెంట్స్

టీమిండియా అసలైన సవాల్​కు సిద్ధమవుతోంది. పొట్టి కప్పులో విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన రోహిత్ సేన.. దర్జాగా సెమీస్ గడప తొక్కింది. కీలక పోరులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి నాకౌట్ ఫైట్​కు అర్హత సాధించింది. ఇప్పుడు ఇంగ్లండ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. బట్లర్ సేనను ఓడిస్తే ఫైనల్ టికెట్ ఖాయం అవుతుంది. అందుకే ఆ టీమ్​ను చిత్తు చేయడానికి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతోంది. సెమీస్​కు ముందు అన్ని ఆయుధాలను బయటకు తీస్తున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. భీకర ఫామ్​లో ఉన్న అతడు.. సూపర్ పోరులో ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకున్నాడు. సెమీస్​లోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అయితే ఇంగ్లీష్ టీమ్ మాత్రం హిట్​మ్యాన్ అంటే తమకు అంత భయం లేదని అంటోంది.

రోహిత్​ కంటే భారత జట్టులో అతడే మరింత డేంజరస్ బ్యాటర్ అని అంటున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. అతడు క్రీజులో కుదురుకుంటే తమ పని ఫినిష్ అని టెన్షన్ పడుతున్నాడు. ఇంగ్లీష్ ప్లేయర్లను అంతగా భయపెడుతున్న ఆ బ్యాటర్ మరెవరో కాదు.. విరాట్ కోహ్లీ. ఐసీసీ టోర్నీల్లో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ ఇప్పుడు పూర్ ఫామ్​తో బాధపడుతున్నాడు. హయ్యెస్ట్ రన్ స్కోరర్స్​ లిస్ట్​లో ఎప్పుడూ పైన ఉండే ఈ టాప్ బ్యాటర్.. ఇప్పుడు ఎక్కడో అట్టడుగున ఉన్నాడు. అయినా ఇంగ్లండ్ ఆటగాళ్లు మాత్రం కోహ్లీ అంటే తమకు భయమని చెబుతున్నారు. విరాట్​ ఆటతీరును ఎన్నో ఏళ్లుగా గమనిస్తూ వస్తున్నానని, అతడి లాంటి కాంపిటీటర్ ఇంకొకరు లేరన్నాడు బట్లర్.

ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో కోహ్లీ ఆడుతుంటాడని, ఆటపై అతడి నిబద్ధత అద్భుతమని మెచ్చుకున్నాడు బట్లర్. అతడు డేంజరస్ బ్యాటర్ అని చెప్పాడు. విరాట్​ను తక్కువ అంచనా వేయడానికి లేదని.. తనదైన రోజున ఆటను ప్రత్యర్థి జట్టు నుంచి లాగేసుకోవడం కింగ్​ స్పెషాలిటీ అని ఇంగ్లండ్ పేసర్‌‌ జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. కోహ్లీ చాలా మంచి వ్యక్తి అని ఆ టీమ్ బ్యాటర్ విల్ జాక్స్ పేర్కొన్నాడు. బరిలోకి దిగితే 150 పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడని, ఓటమి ఒప్పుకోకపోవడం విరాట్ తత్వమని జాక్స్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ ప్లేయర్లు ఇంతలా హైప్ ఇస్తున్న కోహ్లీ గనుక సెమీస్​లో ఫామ్​లోకి వచ్చాడా ఆ టీమ్​కు దబిడిదిబిడే. భారత ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన విరాట్.. టచ్​లోకి వచ్చేందుకు ఇంతకంటే మంచి తరుణం లేదని చెబుతున్నారు. మరి.. కోహ్లీ సెమీస్​లో రాణిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.