iDreamPost
android-app
ios-app

సెమీస్ కోసం సరైనోడ్ని దించుతున్న రోహిత్.. ఇంగ్లండ్​ను ఆపడానికి అతడే కరెక్ట్!

  • Published Jun 26, 2024 | 9:09 PM Updated Updated Jun 26, 2024 | 10:06 PM

పొట్టి కప్పు లాస్ట్ స్టేజ్​కు చేరుకుంది. మెగాటోర్నీలో ఇంకా మూడు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు జరిగే రెండు సెమీఫైనల్స్​తో ఫైనల్​కు వెళ్లే జట్లపై క్లారిటీ వచ్చేస్తుంది.

పొట్టి కప్పు లాస్ట్ స్టేజ్​కు చేరుకుంది. మెగాటోర్నీలో ఇంకా మూడు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు జరిగే రెండు సెమీఫైనల్స్​తో ఫైనల్​కు వెళ్లే జట్లపై క్లారిటీ వచ్చేస్తుంది.

  • Published Jun 26, 2024 | 9:09 PMUpdated Jun 26, 2024 | 10:06 PM
సెమీస్ కోసం సరైనోడ్ని దించుతున్న రోహిత్.. ఇంగ్లండ్​ను ఆపడానికి అతడే కరెక్ట్!

గత కొన్ని వారాలుగా క్రికెట్ లవర్స్​కు ఎంతో ఎంటర్​టైన్​మెంట్​ను అందించిన పొట్టి కప్పు లాస్ట్ స్టేజ్​కు చేరుకుంది. మెగాటోర్నీలో ఇంకా మూడు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు జరిగే రెండు సెమీఫైనల్స్​తో ఫైనల్​కు వెళ్లే జట్లపై క్లారిటీ వచ్చేస్తుంది. ఒక సెమీస్​లో భారత్-ఇంగ్లండ్ తలపడుతుండగా.. మరో నాకౌట్​లో సౌతాఫ్రికా-ఆఫ్ఘానిస్థాన్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. టీమిండియా పోరు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. గత టీ20 వరల్డ్ కప్ సెమీస్​లో ఇంగ్లీష్ జట్టు చేతుల్లోనే ఓడింది మెన్ ఇన్ బ్లూ. అప్పటివరకు అద్భుతంగా ఆడుతూ వచ్చిన టీమ్.. ఇంగ్లండ్ దెబ్బకు కప్పుకు ఆమడ దూరంలో ఆగిపోయింది. దీంతో రోహిత్ సేన పగతో రగిలిపోతోంది. నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్ పని పట్టాలని అనుకుంటోంది.

బట్లర్ సేనను ఓడించేందుకు అవసరమైన వ్యూహాలను పన్నుతోంది భారత టీమ్ మేనేజ్​మెంట్. ప్రత్యర్థి జట్టును ఎక్కడికక్కడ కట్టి పడేయాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాతో సూపర్ పోరులో ఆడిన మాదిరిగానే ఫస్ట్ బాల్ నుంచే ఫుల్ ఇంటెంట్​తో వెళ్లాలని అనుకుంటోంది. అటాకింగ్ అప్రోచ్​తో అపోజిషన్ టీమ్​ను చిత్తు చేయాలని చూస్తోంది. ఇంగ్లండ్​ను ఆపేందుకు కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కలసి మరో మాస్టర్​ప్లాన్ వేశారట. సెమీస్​లో గెలుపు కోసం సరైనోడ్ని దించాలని ఫిక్స్ అయ్యారట. ఆ బ్యాటర్​ను ఆడించి ఇంగ్లీష్ టీమ్​కు షాక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఆ ఆటగాడు మరెవరో కాదు.. సంజూ శాంసన్ అని వినికిడి. ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ప్లేస్​లో సంజూను ఆడించాలని అనుకుంటున్నారని క్రికెట్ వర్గాల సమాచారం.

మెగాటోర్నీలో జడేజా టోటల్ ఫెయిలయ్యాడు. అటు బ్యాటర్​గా, ఇటు బౌలర్​గా అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. అన్ని మ్యాచుల్లో కలిపి 16 పరుగులు చేసిన అతడు.. కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో జడ్డూను తీసేసి స్పెషలిస్ట్ బ్యాటర్​గా సంజూను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోవాలని రోహిత్-ద్రవిడ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు టీమ్​లో ఉండటం, వాళ్లిద్దరూ మంచి ఫామ్​లో ఉండటంతో జడ్డూను తీసేసి శాంసన్​ను బరిలో దింపాలని డిసైడ్ అయ్యారట. సంజూ జట్టులోకి వస్తే బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుంది. ఇంగ్లండ్​ బౌలింగ్ యూనిట్ బాగుంది కాబట్టి బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ దిశగా టీమ్ మేనేజ్​మెంట్ సమాలోచనలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి.. జడ్డూ ప్లేస్​లో సంజూ వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.