iDreamPost
android-app
ios-app

కల్కిలో విజయ్  దేవరకొండ- దుల్కర్ సల్మాన్.. కన్ఫామ్ చేసిన ప్రభాస్..

  • Published Jun 26, 2024 | 8:49 PM Updated Updated Jun 26, 2024 | 8:49 PM

Prabhas Confirmed vijay Devarakonda And Dulquer Rolls On Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ గురించి ప్రభాస్ ఒక క్రేజీ లీక్ అయితే ఇచ్చేశాడు. కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ- దుల్కర్ సల్మాన్ ఉన్న విషయాన్ని బయటపెట్టేశాడు.

Prabhas Confirmed vijay Devarakonda And Dulquer Rolls On Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ గురించి ప్రభాస్ ఒక క్రేజీ లీక్ అయితే ఇచ్చేశాడు. కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ- దుల్కర్ సల్మాన్ ఉన్న విషయాన్ని బయటపెట్టేశాడు.

  • Published Jun 26, 2024 | 8:49 PMUpdated Jun 26, 2024 | 8:49 PM
కల్కిలో విజయ్  దేవరకొండ- దుల్కర్ సల్మాన్.. కన్ఫామ్ చేసిన ప్రభాస్..

కల్కి 2898 ఏడీ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని నిద్ర కూడా పోయే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి హైప్ ఉన్న ఈ మూవీలో ఇప్పటికే చాలా విషయాలు రివీల్ చేస్తూ వచ్చారు. కథ ఎలా ఉంటుంది? అసలు పురాణాలకు.. ఈ కథకు ఉన్న లింక్ ఏంటి? కాశీ, శంబాలా, కాంప్లెక్స్ ఎలా ఉంటాయి? ఇందులో ప్రభాస్ పాత్ర ఏంటి? ఇలా చాలానే హైలెటెడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ, ఈ మూవీలో ఉన్న క్యామియోస్ గురించి మాత్రం ఎక్కడా లీక్ చేయలేదు. కానీ, తాజాగా ప్రభాస్ ఒక క్యారెక్టర్ గురించి మాత్రం క్లారిటీ ఇచ్చేశాడు.

కల్కి సినిమాలో చాలానే వింతలు ఉన్నాయి. చెప్పుకోవడానికి చాలానే విశేషాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ ఒక సైంటిఫిక్ మైథాలజీని తెరకెక్కించాడు. ఈ మూవీలో అటు పురాణాలను.. ఇటు టెక్నాలజీని సమపాళ్లలో చూపిస్తూ వచ్చారు. దైవం మీద భారం వేస్తూనే.. టెక్నాలజీతో యుద్ధం చేస్తున్నారు. మనం విన్న మహాభారతాన్ని ఒకసారి టెక్నాలజీ ఉన్న రోజుల్లో జరిగితే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని రీక్రియేట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో ఎంత చెప్పుకున్నా ఇంకా తరగని వింతలు ఉన్నాయి. వాటిలో కథ గురించి పక్కన పెడితే.. పాత్రల గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో చాలానే పాత్రలు ఉన్నాయి.

కల్కి మూవీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. వారి పాత్రలను కూడా రివీల్ చేస్తూ వచ్చారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే వీళ్లు కాకుండా ఈ మూవీలో ఎంతో మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పేర్లు వినిపించాయి. ఎన్ని వార్తలు వచ్చినా విజయ్ దేవరకొండ.. దుల్కర్ సల్మాన్ మాత్రం స్క్రీన్ మీద కనిపించే వరకు కన్ఫామ్ చేసుకోవడానికి లేదు అనుకున్నారు. కానీ, డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఆ విషయాన్ని ముందురోజే కన్ఫామ్ చేసేశాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్- హీరో ప్రభాస్ ఇద్దరూ ట్విట్టర్ లో లైవ్ కి వచ్చారు.

లైవ్ లో మాట్లాడుతూ ప్రభాస్ ఈ విషయాన్ని లీక్ చేసేశాడు. ఆ తర్వాత తప్పక డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా విజయ్ దేవరకొండ- దుల్కర్ సల్మాన్ ఇద్దరూ కల్కి 2898 ఏడీ మూవీలో ఉన్నారనే విషయాన్ని కన్ఫామ్ చేశాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాస్త గ్యాప్ ఇస్తే ప్రభాస్ కథ కూడా చెప్పేలా అనిపించాడు. ప్రభాస్ లీక్ చేయడంతో వారి క్యామియో అప్పియరెన్స్ గురించి అయితే క్లారిటీ వచ్చేసింది. ఇంక థియేటర్లలో స్పెషల్ అప్పియరెన్సుల్లో వచ్చే స్టార్స్ ని చూసి ఫ్యాన్స్ ఎంత ఊగిపోతారో చూడాలి. మరి.. కల్కిలో విజయ్ దేవరకొండ- దుల్కర్ సల్మాన్ పాత్రలను లీక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom