iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ఫైనల్​పై హర్భజన్ ప్రిడిక్షన్.. ఆ రెండు జట్ల మధ్యే తుదిపోరు అంటూ!

  • Published Jun 26, 2024 | 9:02 PM Updated Updated Jun 26, 2024 | 10:14 PM

టీ20 ప్రపంచ కప్ తుదిదశకు చేరుకుంది. ఇంకో మూడు మ్యాచులతో ఈసారి ఛాంపియన్స్ ఎవరో తేలిపోనుంది. ఈ తరుణంలో ఫైనల్ మ్యాచ్ గురించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.

టీ20 ప్రపంచ కప్ తుదిదశకు చేరుకుంది. ఇంకో మూడు మ్యాచులతో ఈసారి ఛాంపియన్స్ ఎవరో తేలిపోనుంది. ఈ తరుణంలో ఫైనల్ మ్యాచ్ గురించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.

  • Published Jun 26, 2024 | 9:02 PMUpdated Jun 26, 2024 | 10:14 PM
వరల్డ్ కప్ ఫైనల్​పై హర్భజన్ ప్రిడిక్షన్.. ఆ రెండు జట్ల మధ్యే తుదిపోరు అంటూ!

టీ20 ప్రపంచ కప్ తుదిదశకు చేరుకుంది. ఇంకో మూడు మ్యాచులతో ఈసారి ఛాంపియన్స్ ఎవరో తేలిపోనుంది. భారత్-ఇంగ్లండ్, సౌతాఫ్రికా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య నాకౌట్ పోరు జరగనుంది. ఈ మ్యాచుల్లో గెలిచిన టీమ్స్ కప్పు కోసం ఫైనల్​లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ బట్లర్ సేనను పక్కనబెడితే మిగతా మూడు జట్లు కప్పు అందుకోవాలని తహతహలాడుతున్నాయి. అప్పుడెప్పుడో అరంగేట్ర టీ20 వరల్డ్ కప్​లో విన్నర్​గా నిలిచిన టీమిండియా.. మళ్లీ ఇన్నేళ్లలో టైటిల్​ను చేజిక్కించుకోలేకపోయింది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దని చూస్తోంది. ఇక, ప్రొటీస్, ఆఫ్ఘాన్​లు తొలిసారి కప్పును కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ తరుణంలో వరల్డ్ కప్ ఫైనల్ గురించి భారత లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు.

ఈసారి పొట్టి కప్పు ఫైనల్​కు ఎవరు వెళ్తారనే దానిపై హర్భజన్ తన ప్రిడిక్షన్ చెప్పాడు. ఇంగ్లండ్​ను సెమీస్​లో భారత్ ఓడించడం పక్కా అని భజ్జీ అన్నాడు. ఇంగ్లీష్​ టీమ్​ను మట్టికరిపించి రోహిత్ సేన ఫైనల్ గడప తొక్కడం ఖాయమని చెప్పాడు. మరో ఫైనల్ బెర్త్​ను ఆఫ్ఘానిస్థాన్ దక్కించుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. రషీద్ సేనను ప్రొటీస్ ఆపలేదన్నాడు. భారత్​తో పాటు ఆఫ్ఘాన్ ఫైనల్​కు చేరుకుంటుందని భజ్జీ జోస్యం చెప్పాడు. దీంతో అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. హర్భజన్ చెప్పినది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇంగ్లండ్​పై ప్రతీకారంతో రగిలిపోతున్న రోహిత్ సేన ఎలాగైనా ఫైనల్​కు చేరుతుందని చెబుతున్నారు. టీమిండియాతో పాటు సూపర్ ఫామ్​లో ఉన్న ఆఫ్ఘానిస్థాన్ తుదిపోరుకు చేరడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, క్రికెట్ వరల్డ్ కప్​తో బిజీగా ఉన్న హర్భజన్​పై కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీకగా ఉన్న అతడు.. ఇలా మ్యాచెస్​కు కామెంట్రీ చేయడం ఏంటంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అతడి కామెంట్రీ వింటుంటే చెవుల్లో నుంచి నెత్తురు కారుతోందంటూ ఓ నెటిజన్ కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టాడు. అయితే తన మీద వస్తున్న విమర్శలకు భజ్జీ అంతే స్ట్రాంగ్​గా బదులిచ్చాడు. కామెంట్రీ ద్వారా వస్తున్న శాలరీ మొత్తాన్ని ఆర్థిక స్థోమత లేని పిల్లల చదువుల కోసం వినియోగిస్తున్నానని టర్బనేటర్ అన్నాడు. ఒక్క రూపాయి కూడా సొంతానికి ఉపయోగించడం లేదని.. మీలాగే నేను కూడా టాక్స్ కడుతున్నానని హర్భజన్ స్పష్టం చేశాడు. చదువుకుంటానంటే సాయం చేస్తా, మర్యాద నేర్చుకోండి అంటూ భజ్జీ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. మరి.. ఈసారి పొట్టి కప్పులో ఎవరు ఫైనల్​కు చేరతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)