iDreamPost
android-app
ios-app

తెలుగోడు నితీశ్ రెడ్డి బ్యాడ్ లక్.. చేజారిన టీమిండియా డెబ్యూ ఛాన్స్!

  • Published Jun 26, 2024 | 9:09 PM Updated Updated Jun 26, 2024 | 10:10 PM

ఐపీఎల్-2024లో దుమ్మురేపిన సన్​రైజర్స్ హైదరాబాద్ ఆల్​రౌండర్ నితీష్ రెడ్డికి బ్యాడ్ లక్. ఎంచక్కా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడనుకుంటే అది కుదర్లేదు. అతడికి గోల్డెన్ ఛాన్స్ మిస్సైంది.

ఐపీఎల్-2024లో దుమ్మురేపిన సన్​రైజర్స్ హైదరాబాద్ ఆల్​రౌండర్ నితీష్ రెడ్డికి బ్యాడ్ లక్. ఎంచక్కా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడనుకుంటే అది కుదర్లేదు. అతడికి గోల్డెన్ ఛాన్స్ మిస్సైంది.

  • Published Jun 26, 2024 | 9:09 PMUpdated Jun 26, 2024 | 10:10 PM
తెలుగోడు నితీశ్ రెడ్డి బ్యాడ్ లక్.. చేజారిన టీమిండియా డెబ్యూ ఛాన్స్!

ఐపీఎల్-2024లో దుమ్మురేపాడు సన్​రైజర్స్ హైదరాబాద్ ఆల్​రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అందరి చూపుల్ని తన వైపునకు తిప్పుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్​తో టాప్ బౌలర్లను కూడా హడలెత్తించాడు. మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు వస్తూ టీమ్​కు భారీ స్కోర్లు అందించాడు. సన్​రైజర్స్ ఫైనల్ వరకు వెళ్లడంతో ఈ తెలుగోడి పాత్ర ఎంతో ఉంది. ఈ సీజన్​లో 303 పరుగులు చేసి.. ఆరెంజ్ ఆర్మీకి సర్​ప్రైజ్ ప్యాకేజ్​గా మారాడు నితీష్. బౌలింగ్​లోనూ కీలక సమయాల్లో బ్రేక్ త్రూలు అందించాడు. అతడి ప్రదర్శనకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్​ ది అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్​లో అతడి ఆట చూసిన చాలా మంది మాజీ క్రికెటర్లు నితీషే భారత్ ఫ్యూచర్ అని ప్రశంసల్లో ముంచెత్తారు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​లో అతడి పేరు ఉంటుందని అంచనా వేశారు. కానీ అది సాధ్యం కాలేదు.

పొట్టి కప్పులో ఆడే అవకాశం దక్కలేదు. కానీ త్వరలో జరిగే జింబాబ్వే సిరీస్​కు టీమ్​లోకి నితీష్​ రెడ్డిని తీసుకున్నారు సెలెక్టర్లు. దీంతో అతడు బ్లూ జెర్సీని వేసుకొని తెలుగోడి గౌరవాన్ని మరింత పెంచుతాడని అంతా ఆశించారు. అయితే బ్యాడ్ లక్. అతడు గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యాడు. గాయంతో బాధపడుతున్న నితీష్​ను జింబాబ్వే సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. అతడి స్థానంలో ఆల్​రౌండర్ శివమ్ దూబేను రీప్లేస్ చేసింది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో నితీష్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. పాపం.. నితీష్ కష్టం వృథా అయిందని అంటున్నారు. డెబ్యూ కోసం మరికొన్నాళ్లు ఎదురుచూపులు తప్పవని.. అయినా నువ్వో ఛాంపియన్​వి, త్వరగా కోలుకొని ఎంట్రీ ఇవ్వు అంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. మరి.. నితీష్​ టీమిండియాలో ఆడే ఛాన్స్ మిస్సవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.