nagidream
Manikonda,Hyderabad Flat Rates Reduced: హైదరాబాద్ లోని ప్రధాన ఏరియాల్లో స్థలాల ధరలు, ఇళ్ల ధరలు తగ్గాయి. కొన్నిచోట్ల భారీగా తగ్గగా మరికొన్ని చోట్ల కొంచెం తగ్గాయి. మణికొండలో కూడా స్థలాల ధరలు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?
Manikonda,Hyderabad Flat Rates Reduced: హైదరాబాద్ లోని ప్రధాన ఏరియాల్లో స్థలాల ధరలు, ఇళ్ల ధరలు తగ్గాయి. కొన్నిచోట్ల భారీగా తగ్గగా మరికొన్ని చోట్ల కొంచెం తగ్గాయి. మణికొండలో కూడా స్థలాల ధరలు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?
nagidream
హైదరాబాద్ లో స్థలం కొనలేని వారు ఫ్లాట్ వైపే మొగ్గుచూపుతారు. స్థలానికి పెట్టే పెట్టుబడిలో సగం డబ్బుతో మంచి లగ్జరీ ఫ్లాట్ కొనుక్కోవచ్చు. స్థలంతో పోలిస్తే దాని విలువ అంత ఉండదు కానీ మరీ తీసిపడేసేంతగా ఉండదు. ఫ్లాట్లు కొనేవారు కూడా చాలా మంది ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఫ్లాట్స్ అంటే అన్ని సౌకర్యాలు, పిల్లల కోసం ప్లే ఏరియాలు, పార్కులు వంటివి ఉండడంతో ఫ్లాట్స్ కూడా గొప్ప ఛాయిస్ గా మారిపోయాయి. అయితే తక్కువ ధరకు కొంచెం సిటీకి దూరంగా కొనుక్కుంటున్నారు. ఒక పది లక్షలు ఆదా అవుతున్నాయంటే మీరు సిటీలో ఫ్లాట్ కొనలేరా? అవును గతంతో పోలిస్తే మణికొండలో ఇప్పుడు ఫ్లాట్స్ ధరలు తగ్గాయి. దీనికి కారణం స్థలాల ధరలు పెరగడమే. మణికొండలో ఫ్లాట్స్ కంటే స్థలాల ధరలే రెట్టింపు ఉన్నాయి.
ఈ ఏరియాలోనే కాదు హైదరాబాద్ లోని చాలా ఏరియాల్లో స్థలాల రేట్లు పెరిగాయి. ఇళ్ల ధరలు తగ్గాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం ఇళ్ల ధరలు పెరిగి, స్థలాల ధరలు తగ్గాయి. ఇప్పుడు మణికొండలో అయితే ఫ్లాట్ రేట్లు తగ్గాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ మణికొండలో ఆరు సార్లు అపార్ట్మెంట్ ధరలు తగ్గాయి. 2019లో చదరపు అడుగు ఫ్లాట్ ధర రూ. 4,600 ఉండగా.. 2020 ఏడాదిలో రూ. 4,500కి తగ్గింది. అదే చివరిలో రూ. 4,900కి పెరిగింది. ఆ తర్వాత ఏడాది 2021లో రూ. 4,800కి తగ్గింది. అదే ఏడాది చివరిలో రూ. 5,900కి పెరిగింది. 2022లో రూ. 6 వేలకు పెరిగిన చదరపు అడుగు ఫ్లాట్ ధర ఆ ఏడాది చివరి నాటికి రూ. 5,800కి తగ్గింది.
2023లో రూ. 6,050కి పెరిగిన ఫ్లాట్ ధర ఏడాది చివరి నాటికి రూ. 7 వేలకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 7,750కి పెరిగింది. ప్రస్తుతం అయితే రూ. 6,850కి పడిపోయింది. చదరపు అడుగు మీద యావరేజ్ గా రూ. 900 తగ్గింది. అంటే గజం మీద రూ. 8,100 తగ్గినట్టు. మీరు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ కొనాలనుకుంటే కనుక మీకు దాదాపు రూ. 11 లక్షలు ఆదా అవుతాయి. హైదరాబాద్ లో మళ్ళీ రియల్ ఎస్టేట్ జోరందుకుంటే ఎంత పడిపోయిందో ఆ రేటు మళ్ళీ వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ వచ్చినా రావచ్చు. ప్రస్తుతం మణికొండలో యావరేజ్ గా ఫ్లాట్ ధర చదరపు అడుగుకి రూ. 6,850 అంటే 1200 చదరపు అడుగులకు రూ. 82 లక్షలు అవుతుంది. అంతకు ముందు రూ. 93 లక్షలుగా ఉండేది. ఇప్పుడు కొనుగోలు చేయడం వల్ల మీకు 11 లక్షలు ఆదా అవుతాయి.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.