iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ హీరోయిన్ కి చేదు అనుభవం..గంటల తరబడి!

Aditi Rao Hydari: కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇన్ స్టాలో ఆవేదనతో వ్యక్తం చేసింది.

Aditi Rao Hydari: కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇన్ స్టాలో ఆవేదనతో వ్యక్తం చేసింది.

బాలీవుడ్ హీరోయిన్ కి చేదు అనుభవం..గంటల తరబడి!

సెలబ్రిటీలకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అలానే వింత పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. షాపింగ్ ఓపెనింగ్ సమయంలో, ఇతర సందర్భాల్లో హీరోయిన్లు వింత అనుభవం ఎదుర్కొంటారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి సోషల్ మీడియాలో పంచుకుంటారు. కొంతమంది హీరోయిన్లకు లైంగిక వేధింపు వంటి చేదు ఘటనలు ఎదురవ్వగా మరికొందరికి వేరే ఇతర ఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరీకి చేదు అనుభవం ఎదురైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

అదితిరావు హైదరీ.. ఈ బ్యూటీ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే ‘హీరామండి ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ తో అభిమానులను మెప్పించింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో అదితిరావు హైదరీ నటన అందరిని ఆకట్టుకుంది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఈ సిరీస్ లో ఏ రేంజ్ లో ఆకర్షించింది. ఇది ఇలా ఉంటే.. ఈ అమ్మడికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈనెల 23న ముంబయిలో సోనాక్షి సిన్హా వివాహం జరిగిన సంగతి తెలిసింది. ఈ పెళ్లికి అదితీరావు హైదరీ హాజరైంది. తనకు కాబోయే భర్త సిద్దార్థ్‌తో కలిసి రిసెప్షన్‌లో పాల్గొన్ని.. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇటీవలే ఇంగ్లాక్ కి వెళ్లిన అదితి రావు హైదరీకి ఇంగ్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది.  బ్రిటన్ లోని హీత్రో విమానాశ్రయంలో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్  అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది. తన లగేజీ కోసం త్వరగా రాలేదని, దాదాపు ఆరు గంటలకు పైగా  విమానాశ్రయంలో వాటి కోసం వేచి ఉండాల్సి వచ్చిందంటూ తన ఆవేదనను వెల్లడించింది. అంతేకాక ఇదొక చెత్త ఎయిర్‌పోర్ట్‌ అంటూ తన ఆక్రోశాన్ని బయట పెట్టింది. ఇక అక్కడి విమానాశ్రయ సిబ్బంది తనకు సాయం చేయకుండా ఉచిత సలహాలు ఇచ్చారనే తెలిపింది. తన లగేజీ కోసం ఎయిర్‌లైన్‌ సంస్థను సంప్రదించమని సలహా ఇచ్చారని వెల్లడించింది. ఎయిర్ పోర్టులో దిగిన తరువాత దాదాపు  6 గంటల తర్వాత కూడా తన లగేజీ అందలేదని అదితి ఆవేదన వ్యక్తం చేసింది.

 

View this post on Instagram

 

A post shared by India Today (@indiatoday)