iDreamPost

ఇకనుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఫ్రీగా సినిమాలు.. కానీ,అదొక్కటి తప్ప

  • Published Jun 26, 2024 | 5:51 PMUpdated Jun 26, 2024 | 5:51 PM

Netflix : ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఫ్రెష్ కంటెంట్ ను అందిచడంలో ముందుటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు తమ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అందిస్తూ ఉంటుంది. అయితే ఈ నెట్ ఫ్లిక్స్ సంస్థ తన ఫ్రీ కంటెంట్ ను అందిచే ఆలోచనలో ఉంది. కానీ దానిలో ఒక్కటిని మాత్రం తప్పదు అని టాక్ వినిపిస్తోంది.

Netflix : ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఫ్రెష్ కంటెంట్ ను అందిచడంలో ముందుటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు తమ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అందిస్తూ ఉంటుంది. అయితే ఈ నెట్ ఫ్లిక్స్ సంస్థ తన ఫ్రీ కంటెంట్ ను అందిచే ఆలోచనలో ఉంది. కానీ దానిలో ఒక్కటిని మాత్రం తప్పదు అని టాక్ వినిపిస్తోంది.

  • Published Jun 26, 2024 | 5:51 PMUpdated Jun 26, 2024 | 5:51 PM
ఇకనుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఫ్రీగా సినిమాలు.. కానీ,అదొక్కటి తప్ప

ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థల్లో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. కాగా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హవా అనేది జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా ఇండియాతో పాటు ఇతర దేశల్లో కూడా నెట్ ఫ్లిక్స్ ఆదరణ అనేది మరింత ఎక్కువగా పెరుగుతోంది. అలాగే ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెట్ అందిచడంతో పాటు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు అందించడంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందచులో ఉంటుంది. అయితే మొదట్లో ఎక్కువగా హాలీవుడ్ తో సహా ఇతర భాషల కంటెట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్ ఈ ఫ్లాట్ ఫామ్ లో వచ్చేవి. ఇక ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ మెల్లగా తన సబ్స్క్రైబర్లను పెంచుకునే  వివిధ జోనర్ కు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్, వీడియో గేమ్స్ తో అలరిస్తున్న సంగతి తెలసిందే. అలాగే భారీ చిత్రాలను సైతం భారీ వ్యయంతో కొనుగోలు చేసి తమ సబ్స్క్రైబర్లకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి వివిధ భాషల్లో ముందుంచే ఘనత నెట్ ఫ్లిక్స్ కే సొంతం.

ఇదిలా ఉంటే.. తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తన వ్యాపారంలో గణనీయమైన మార్పులను చేస్తోంది. అనగా ఇక నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కంటెంట్ ను వినియోగదారులు ఉచితంగా చూసే వెసులుబాటును తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం తెలిసింది. అయితే ఈ ఫ్రీ కంటెట్ ప్లాన్ ను ప్రధానంగా యూరప్, ఆసియాలోని ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకొని తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫ్రీ కంటెంట్ ప్లాన్ అనేది ఇంక ఇండియాకు వస్తుందా లేదా అనేది మాత్రం ఇంక స్పష్టత రాలేదు. ఎందుకంటే.. నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఉచిత ప్లాన్‌ను ప్రవేశపెట్టలేదు. కానీ, ఇండియాలో కూా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ను ఫ్రీగా చూసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ అదే జరిగితే.. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌కి యాక్సెస్ పొందడానికి వినియోగదారులు నగదును ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అనగా.. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండానే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని సినిమాలు, వెబ్ సిరీసులను చక్కగా వీక్షించవచ్చు. అయితే నెట్ ఫ్లిక్ లో ఉచితంగా చూసే వారకి అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే..  ఫ్రీగా చూసేవారికి కనీసం 20 నిమిషాలు, అరగంటకు ఓసారి ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉందని ఆ అడ్వర్టైజ్‌మెంట్స్‌తోనే ఉచితంగా వీక్షించవచ్చని సమాచారం. అయితే ఈ ప్రకటనల బారి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం కనీసం నెలవారి ప్లాన్ తీసుకోవాల్సిందేనని తెలుస్తోంది. కానీ, ప్రస్తుతానికి ఈ ఫ్రీ కంటెంట్ అనేది ప్రాథమిక దశలో ఉంది.

కాగా, ఇంతకుముందు ఈ ప్లాన్‌ను కెన్యాలో పరీక్షించారు. లిమిటెడ్ సెలెక్ట్ కంటెంట్‌ను కెన్యాలో నెట్‌ఫ్లిక్స్ అందించింది. కానీ, తర్వాత దాన్ని నిలిపివేసింది. కనుక త్వరలోనే త్వరలో ఇలాంటి తరహా ప్లాన్‌నే పరిమిత కంటెంట్‌తో జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ప్రయోగించనుందని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఓటీటీ సంస్థలతో ఉన్న పోటీని ఎదుర్కునేందుకే నెట్‌ఫ్లిక్స్ ఈ సంచలన మార్పు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఉచిత ఎంపికను యూఎస్‌లో ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేయలేదని, దాని ప్రస్తుత మోడల్‌లు చివరి దశలో ఉన్నాయని పేర్కొంది. మరి, త్వరలోనే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఫ్రీగా కంటెంట్ ను అందించలనే ఆలోచన చేస్తుందనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి