iDreamPost
android-app
ios-app

భవిష్యత్ కోసం యువతి ఒంటరి పోరాటం.. OTTలో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్!

  • Published Jun 26, 2024 | 9:31 PM Updated Updated Jun 26, 2024 | 9:31 PM

OTT Suggestions- Best Fantasy Movie TomorrowLand: ఓటీటీల్లో ఒక బెస్ట్ ఫాంటసీ చిత్రం అందుబాటులో ఉంది. నిజానికి ఇది చూశాక అరె భలే మూవీ చూశామే అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

OTT Suggestions- Best Fantasy Movie TomorrowLand: ఓటీటీల్లో ఒక బెస్ట్ ఫాంటసీ చిత్రం అందుబాటులో ఉంది. నిజానికి ఇది చూశాక అరె భలే మూవీ చూశామే అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

  • Published Jun 26, 2024 | 9:31 PMUpdated Jun 26, 2024 | 9:31 PM
భవిష్యత్ కోసం యువతి ఒంటరి పోరాటం.. OTTలో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్!

మీరు చాలానే సూపర్ హీరో చిత్రాలు, చాలానే ఫాంటసీ ఫిల్మ్స్ చూసుంటారు. వాటిలో కొన్ని కొన్ని మాత్రం మీ హృదయాలకు బాగా దగ్గరై ఉండి ఉండచ్చు. అలాంటి ఒక లిస్ట్ లోకి ఈ చిత్రం కూడా చేరుతుంది. ఇది సూపర్ హీరోల చిత్రం కాదు. కానీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాంటసీ చిత్రం అనమాట. మీరు బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీ చూసే ఉంటారు. అందులో హీరో, హీరోయిన్ ఫ్యూచర్ లోకి వెళ్తారు. అయితే ఈ మూవీ కూడా కాస్త అటూ ఇటూగా అలాగే ఉంటుంది. కానీ, ఇక్కడ ఒక యువతికి ఆ అవకాశం దక్కుతుంది. అయితే వర్తమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది భవిష్యత్ మీద ప్రభావం చూపుతుంది. అసలు ఆ మూవీ ఏది? అందులో అంత స్పెషల్ ఏముందో చూద్దాం.

ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ టైమ్ మిషిన్ లో ఒకసారి గతంలోకి.. ఒకసారి భవిష్యత్ లోకి వెళ్లి వస్తాడు. అయితే అతను అలా వెళ్లడం వల్ల గతానికి గానీ.. భవిష్యత్తుకు గానీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ, ఈ మూవీలో మాత్రం భవిష్యత్ మొత్తం వర్తమానం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ టైమ్ మిషన్ కూడా అక్కర్లేదు. కేవలం ఒక కాయిన్ పట్టుకుంటే భవిష్యత్తుకు వెళ్లిపోవచ్చు. అలాంటి డాలర్ ఒకసారి యువతికి దక్కుతుంది. ఆమె ఆ డాలర్ ని పట్టుకోగానే వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. తాను అక్కడ ఉన్న విషయాలను చూసి ఆశ్చర్యపోతుంది. ఆమెకు అసలు కాసేపు ఏమీ అర్థం కాదు. తాను ఎక్కడ ఉందో కూడా తెలియదు.

అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఆ డాలర్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. అయితే అందుకు సంబంధించిన ఒక వ్యక్తిని కలిసేందుకు వెళ్తుంది. కానీ, అక్కడి నుంచే ఆమె లైఫ్ మలుపులు తిరుగుతుంది. అక్కడ అంతా చాలా కొత్తగా ఉండటమే కాకుండా.. ఆమె ప్రాణాలు కూడా పోయేంత పని అవుతుంది. వీళ్లు భవిష్యాత్తుని కాపాడేందుకు ఎలా అయితే ఒక ప్రపంచాన్ని సృష్టించారో.. దానిని నాశనం చేసేందుకు కూడా ఒక టీమ్ తిరుగుతూ ఉంటుంది. వాళ్ల చేతుల్లో గనుక ఆ ప్రపంచం పడితే ఇంక అంతా నాశనం అవుతుంది.

అలాంటి ఒక ఛాలెంజింగ్ మిషన్ లోకి ఆమెకు తెలియకుండా ఆ యువతి చేరుతుంది. అంతేకాకుండా.. ఆమె చుట్టూ ప్రమాదాలు, వింతలు జరుగుతూ ఉంటాయి. ఆమె తనని తాను కాపాడుకోవడమే కష్టం అయితే.. ప్రపంచాన్ని కాపాడాల్సిన భాద్యత తన మీద పడుతుంది. ఈ సినిమా పేరు ‘టుమారో ల్యాండ్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ మీరు ఇప్పటికే చూసుంటే మీకు ఎలా అనిపించిందో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet