iDreamPost
android-app
ios-app

టబుని ఇలాంటి రోల్ లో అస్సలు చూసుండరు.. OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Thriller Missing movie: ఓటీటీలో కొన్ని థ్రిల్లర్స్ చూస్తే అంత తేలిగ్గా మర్చిపోలేం. అలాంటిది టబు- మనోజ్ భాజ్ పేయీలాంటి యాక్టర్స్ ఉంటే అది మర్చిపోవడం అనేది అసాధ్యం అనే చెప్పాలి. మరి.. ఆ మూవీ ఏంటో మీరూ చూసేయండి.

OTT Suggestions- Best Thriller Missing movie: ఓటీటీలో కొన్ని థ్రిల్లర్స్ చూస్తే అంత తేలిగ్గా మర్చిపోలేం. అలాంటిది టబు- మనోజ్ భాజ్ పేయీలాంటి యాక్టర్స్ ఉంటే అది మర్చిపోవడం అనేది అసాధ్యం అనే చెప్పాలి. మరి.. ఆ మూవీ ఏంటో మీరూ చూసేయండి.

టబుని ఇలాంటి రోల్ లో అస్సలు చూసుండరు.. OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

టబు గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు ఈమె సినిమాలు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే క్రూ పేరిట ఒక మల్టీస్టారర్ తెరకెక్కించి.. కోట్ల వర్షం కురిపించింది. అయితే టబు తన లైఫ్ లో చాలానే రోల్స్ చేసింది. కానీ, ఇలాంటి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ మాత్రం చేయలేదు. అలాంటి ఒక మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. పైగా ఆ మూవీలో కో స్టార్ గా మనోజ్ భాజ్ పేయీ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరి యాక్టింగ్ కి ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. పైగా అది అలాంటి ఇలాంటి మూవీ కాదు. అది ఒక బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్. మరి.. ఆ మూవీ ఏదో చూద్దాం.

యాక్టింగ్ పరంగా మనోజ్ భాజ్ పేయీ.. టబు ఇద్దరూ విలక్షణ నటులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భావాలు పలికిచండంలో వీళ్లిద్దరి ఎవరికి వాళ్లే బెస్ట్. అలాంటి వాళ్లకి మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు దొరికితే ఏం చేస్తారు? ఇరగదీస్తారు. ఈ చిత్రంలో కూడా వీళ్లిద్దరు అదే చేశారు. టబు- మనోజ్ భాజ్ పేయీ ఇద్దరూ భార్యా భర్తలు. వాళ్లిద్దరు తమ చిన్నారి కుమార్తె తితిలీతో కలిసి ట్రిప్పుకు వెళ్తారు. అయితే అక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, అక్కడే కథ అడ్డం తిరుగుతుంది. అక్కడకు వెళ్లిన తర్వాత.. భార్యాభర్తలు ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారి చిన్నారి కుమార్తెను ఎవరో అపహరిస్తారు.

అయితే ఇక్కడే అసలు సమస్య ఉంటుంది. మారిషస్ పోలీసులు ఈ కేసును విచారణ చేయడం ప్రారంభిస్తారు. వారికి అన్నీ అనుమానాలే అనిపిస్తాయి. వారి ప్రయాణం మొదలు.. వారి ప్రవర్తన, వారి రిలేషన్ అంతా వారికి ఏదో కట్టు కథలా అనిపిస్తూ ఉంటుంది. పోలీసులు మిస్సింగ్ కేసు కంటే ముందు.. ఈ భార్యాభర్తల మధ్య ఏం ఉందో తెలుసుకోవాలి అనుకుంటారు. ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తపన, ఆవేదనను టబు తన నటనతో కళ్లకు కట్టినట్లు చూపించింది. అలాగే మనోజ్ భాజ్ పేయీ కాస్త అనుమానం కలిగేలా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ బిడ్డను ఇతనే మాయం చేశాడు అనేలా ప్రవర్తన ఉంటుంది. పైగా అతనికి మరో ఎఫైర్ కూడా ఉన్నట్లుగా ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు.

అలాగే పోలీసులు కూడా అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు ఆ బిడ్డను ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ అపహరణకు ఈ తండ్రికి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాళ్లిద్దరూ ఎందుకు అక్కడికి వచ్చారు? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. మొత్తానికి కథను మాత్రం ఎంతో గ్రిప్పింగ్గా రాసుకున్నారు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలాగే దృష్టి కూడా మరల్చకుండా వారి యాక్టింగ్ సాగుతూ ఉంటుంది. ఈ సినిమా పేరు మిస్సింగ్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ మూవీ చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో.. కామెంట్ చేయండి.