iDreamPost

Unstoppable With NBK : పక్కా ప్లానింగ్ తో సెలబ్రిటీ టాక్ షో

Unstoppable With NBK : పక్కా ప్లానింగ్ తో సెలబ్రిటీ టాక్ షో

ఆహా బాలకృష్ణతో టాక్ షో మొదలుపెట్టినప్పుడు సవాలక్ష అనుమానాలు. యాంకర్ గా ఇంటర్వ్యూలను బాలయ్య సమర్ధవంతంగా నిర్వహిస్తారా లేదాని. కానీ వాటిని తిప్పి కొడుతూ నందమూరి స్టార్ హీరో దూసుకుపోతున్నారు. చేతికి దెబ్బ తగిలినా కట్టు కట్టుకుని మరీ షోని నడిపిస్తున్నారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్స్ లో ఆయన ఎనర్జీని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని సూపర్ హిట్ చేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్స్ పెంచుకోవాలని చూస్తున్న ఆహా నిర్వాహకులు దానికి తగ్గట్టే సెలబ్రిటీ లిస్టుని తయారు చేస్తున్నారు. ఇక్కడ బాలయ్య పలుకుబడి బాగా ఉపయోగపడుతోంది. బ్రహ్మానందం-అనిల్ రావిపూడి ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది

త్వరలో రాజమౌళి ఎంఎం కీరవాణిని కంబైన్డ్ గా మాట్లాడించబోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఒకే ముఖాముఖీలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. అందులోనో బాలకృష్ణకు బొబ్బిలి సింహం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు మరగతమణికి ఉంది. ఇక జక్కన్న ఇప్పటిదాకా బాలయ్య ను డైరెక్ట్ చేయలేదు కానీ ఏమైనా ఆసక్తికరమైన విశేషాలు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో షూట్ చేసిన ఎపిసోడ్ ని రిజర్వ్ లో ఉంచారు. ఏదైనా స్పెషల్ అకేషన్ చూసి వదలబోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో మోకాలికి చికిత్స చేయించుకుని రెస్ట్ తీసుకున్న మహేష్ ని ఈ రూపంలో చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇంకా నెక్స్ట్ లిస్టు కూడా గట్టిగానే ఉంది. విజయ్ దేవరకొండ, రవితేజ, రోజా, శ్రేయ, రానా దగ్గుబాటిలు రాబోతున్నారట. వీళ్ళతో అంగీకారం తీసుకున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ కూడా రావొచ్చన్నారు కానీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ టైంలో ఏమైనా సాధ్యమవుతుందేమో చూడాలి. ప్రభాస్ కున్న టైట్ షెడ్యూల్స్ లో రాకపోవచ్చు. పైన చెప్పిన సెలబ్రిటీలు వచ్చినా సందడి జోరుగా ఉంటుంది. యాంకరింగ్ లో చిరంజీవి, నాగార్జున, నాని, జూనియర్ ఎన్టీఆర్, రానా, సమంతాల తర్వాత వాళ్ళ కన్నా ఎక్కువగా బాలయ్య తన మార్కుని అన్ స్టాపబుల్ ద్వారా చూపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Also Read : Balakrishna : ఆధ్యాత్మిక ఫార్ములాలో చాలా రిస్క్ ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి