iDreamPost
android-app
ios-app

SS Rajamouli: రాజమౌళి ఒక్కడికే ఇది ఎలా సాధ్యమైంది? ఆ విషయంలో జక్కన్న నిజంగా తోపే..

  • Published Jul 17, 2024 | 3:38 PM Updated Updated Jul 17, 2024 | 3:49 PM

ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాడు అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఒక విషయంలో మాత్రం జక్కన్న తోపు అనక తప్పదు. ఇది ఆయన ఒక్కడికే ఎలా సాధ్యం అయ్యింది? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేకెత్తిస్తున్న ప్రశ్న.

ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాడు అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఒక విషయంలో మాత్రం జక్కన్న తోపు అనక తప్పదు. ఇది ఆయన ఒక్కడికే ఎలా సాధ్యం అయ్యింది? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేకెత్తిస్తున్న ప్రశ్న.

SS Rajamouli: రాజమౌళి ఒక్కడికే ఇది ఎలా సాధ్యమైంది? ఆ విషయంలో జక్కన్న నిజంగా తోపే..

ఒక సినిమాను నిర్మించి.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అన్నది నిజంగా కత్తిమీద సాము లాంటిదే. 24 విభాగాలను సమన్వయం చేసుకుంటూ.. షూటింగ్ ను సకాలంలో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ట్రెండ్ నడుస్తోంది. అదే సీక్వెల్స్ ట్రెండ్. స్టార్ హీరోలతో రెండు భాగాలుగా సినిమాలు చేయడం ప్రారంభించారు డైరెక్టర్లు. అయితే ఈ సంప్రదాయానికి ఆధ్యుడు ఎవరంటే? కచ్చితంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలితో ఈ ట్రెండ్ సెట్ చేశాడు. అదీకాక ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాడు. అయితే ఒక విషయంలో మాత్రం జక్కన్న తోపు అనక తప్పదు. ఇది ఒక్కడికే ఎలా సాధ్యం అయ్యింది? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేకెత్తిస్తున్న ప్రశ్న.

ఎస్ఎస్ రాజమౌళి.. టాలీవుడ్ పేరును గ్లోబల్ రేంజ్ లో సువర్ణాక్షరాలతో లిఖించిన ధీరుడు. ఇప్పటి వరకు ఒక్క అపజయం అన్నది కూడా ఎరగని డైరెక్టర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. టైమ్ తీసుకున్నప్పటికీ.. సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తాడు కాబట్టి అభిమానులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. ఇక బాహుబలితో సీక్వెల్స్ ట్రెండ్ కు నాంది పలికాడు. అయితే సీక్వెల్స్ తెరకెక్కించడంలో వాటిని కరెక్ట్ గా విడుదల చేయడంలో రాజమౌళి నిజంగా గ్రేట్ అని చెప్పాలి. విజువల్ వండర్ కాకుండా నార్మాల్ మూవీస్ ను కరెక్ట్ టైమ్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే గగనం. అలాంటి బాహుబలి 2 ను చెప్పిన టైమ్ కు రిలీజ్ చేసి జక్కన్న వావ్ అనిపించుకున్నాడు.

SS Rajamouli

జక్కన్న తెరకెక్కించిన బాహుబలి పార్ట్ 1 2015 జూలై 10న విడుదల అయ్యింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి పార్ట్ 2017 ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. అంటే రెండు సంవత్సరాల కంటే ముందుగానే, పైగా అనుకున్న టైమ్ కు  పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రాజమౌళి. ఇంత ఫర్పెక్ట్ గా చెప్పిన టైమ్ సీక్వెల్ ను రిలీజ్ చేయడం రాజమౌళి ఒక్కడికే ఎలా సాధ్యమైంది? దాని వెనక జక్కన్న పక్కా ప్లానింగ్స్ ఉన్నాయి. రాజమౌళి ఓ సినిమా షూటింగ్ కు వెళ్తున్నాడు అంటే పిన్ టు పిన్ ఏది ఎప్పుడు, ఎక్కడ తీయాలో అన్నీ ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతాడు.

మైండ్ లో ఏం అనుకుంటున్నాడో దాన్ని కరెక్ట్ గా అనుకున్న తర్వాతే షూటింగ్ షురూ చేస్తాడు జక్కన్న. అందుకోసం కాస్త సమయం ఎక్కువ తీసుకుంటాడు కూడా. అయినప్పటికీ.. షూట్ స్టార్ట్ అయ్యాక బ్రేకుల్లేకుండా కొనసాగిస్తాడు, ఓ యంగ్ డైరెక్టర్ లాగా. పార్ట్ 1 కంటే గ్రాండియర్ గా పార్ట్ 2ను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత.  కాగా.. జక్కన్న లాగా కరెక్ట్ టైమ్ కు పార్ట్ 2లను డెలివరీ చేసే డైరెక్టర్లు కూడా ఉన్నారు. కానీ వారికి కొన్ని అడ్డంకుల కారణంగా అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేకపోతున్నారు. మరి రాజమౌళి ఒక్కడికే ఇది ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.