iDreamPost
android-app
ios-app

SSMB 29.. ఆచితూచి అడుగులు వేస్తున్న మహేశ్, జక్కన్న!

  • Published Jul 18, 2024 | 4:40 PM Updated Updated Jul 18, 2024 | 4:40 PM

SSMB 29.. మూవీ విషయంలో ఇటు రాజమౌళి, అటు మహేశ్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సూపర్ స్టార్ బర్త్ డే రోజు కూడా ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేనట్లు తెలుస్తోంది.

SSMB 29.. మూవీ విషయంలో ఇటు రాజమౌళి, అటు మహేశ్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సూపర్ స్టార్ బర్త్ డే రోజు కూడా ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేనట్లు తెలుస్తోంది.

SSMB 29.. ఆచితూచి అడుగులు వేస్తున్న మహేశ్, జక్కన్న!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడంటే.. చాలు ప్రేక్షకులు ఆ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంటారు. ప్రస్తుతం SSMB 29పై కూడా ఇలాంటి హైపే క్రియేట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేశ్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా అధికారికంగా టీమ్ ప్రకటించలేదు. మహేశ్ బర్త్ డే(ఆగస్ట్ 9)న స్పెషల్ వీడియో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఆరోజున ఎలాంటి అప్డేట్స్ ఉండవని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇంతలా జక్కన్న, మహేశ్ ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఏంటి? అని రాతీస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రాజమౌళి ఏ మూవీని తెరకెక్కిస్తున్నా.. అందుకు సంబంధించి ప్రీ ప్లాన్స్ తో రెడీగా ఉంటాడు. ప్రస్తుతం మహేశ్ మూవీతో కూడా ఈ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన గ్రీన్ మ్యాచ్ వర్క్స్ తో పాటుగా అవుట్ డోర్ షూటింగ్ కు సంబంధించిన విషయాలను స్టంట్ మాస్టర్స్ తో పాటుగా ఇతర ముఖ్యమైన టెక్నీషియన్స్ తో చర్చిస్తున్నట్లు సమాచారం. అసలు షూటింగే స్టార్ట్ కాకుండానే ఎలాంటి? ఏం అప్డేట్ ఇస్తాం? అన్నది జక్కన్న ఆలోచన కావొచ్చు. అందుకే ప్రిన్స్ బర్త్ డేకి ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా షాకిచ్చాడు ఫ్యాన్స్ కి.

అదీకాక SSMB29 మూవీ క్యాస్టింగ్ కు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నటీ, నటుల ఎంపిక, డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోతే.. షూటింగ్ మెుదలుపెట్టాక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రాకూడదనే జక్కన్న ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్ కూడా ఇది గమనించి కామ్ గా ఉన్నాడట. ఫ్యాన్స్ కు తమ హీరోను ఎప్పుడెప్పుడు తెర మీద చూడాలి అన్న ఆసక్తి ఉంటుంది. ఆ ఇంట్రెస్టుకు తగ్గట్లుగా మేకర్స్ మూవీ అప్డేట్స్ వదులుతూ ఉంటారు. కానీ ఇలాంటి సందర్భాల్లో కాస్త వెనకాముందు ఆలోచించి, తొందరపడకుండా.. ముందుకు వెళ్లానని జక్కన్న, మహేశ్ భావిస్తున్నారట. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişgamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş