iDreamPost

పనిపై బంధువు ఇంటికి వెళ్లింది.. అదే ఆమె తప్పా..?

ప్రతి ఒక్కరు తమ జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ కోరికలకు తగినట్లే కృషి చేస్తూ లైఫ్ లో ముందుకెళ్తుంటారు. ఇలానే ఓ యువతి కూడా తన లైఫ్ పై ఎంతో ఊహించుకుంది. బుధవారం బంధువుల ఇంటికి సంతోషంగా వెళ్లింది. ఆ తరువాత..

ప్రతి ఒక్కరు తమ జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ కోరికలకు తగినట్లే కృషి చేస్తూ లైఫ్ లో ముందుకెళ్తుంటారు. ఇలానే ఓ యువతి కూడా తన లైఫ్ పై ఎంతో ఊహించుకుంది. బుధవారం బంధువుల ఇంటికి సంతోషంగా వెళ్లింది. ఆ తరువాత..

పనిపై బంధువు ఇంటికి వెళ్లింది.. అదే ఆమె తప్పా..?

ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. ముఖ్యంగా చదవుకునే విద్యార్థులు..కష్టపడి విద్యాలో ముందుండాలని కోరుకుంటారు. అలానే చాలా మంది తమ తల్లిదండ్రులన ఆశలను నిరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంటారు. అయితే కొందరిపై విధి కన్నెర్ర చేస్తోంది. అలానే ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిపై మృత్యువు పాశం వదలింది. పనిపై బాబాయి ఇంటికి వెళ్లిన ఆ యువతి..విగత జీవిగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కరీంనగర్ జిల్లా సుల్తాన్ బాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన హన్సిక(17) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. హన్సిక తోటి విద్యార్థులతో పొరుగువారితో ఎంతో కలివిడిగా ఉండేది. ఇక తమ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు హన్సిక తల్లిదండ్రులు. బాగా చదివించి.. మంచి ప్రయోజకురాలిని చేయాలని భావించారు. వారు ఒకటి తలిస్తే విధి మరోకటి తలచింది. సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబంలో విషాదం నింపింది. హన్సిక జూలపల్లి మండలం తెలుకుంటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ చదువుతోంది. బుధవారం కరీంనగర్‌ పట్టణంలోని విద్యానగర్‌ ప్రాంతంలో తన బాబాయి ఇంటికి పనిపై వెళ్లింది. బాబాయ్‌ కొడుకు భానుప్రకాశ్‌తో కలిసి బైక్ పై  తిరిగి సుల్తానాబాద్‌కు బయలు దేరింది.

ఈక్రమంలో దుబ్బపల్లి వద్ద  వారి బైక చేరుకోగానే ఘోరం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ను లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్సిక తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలానే ఆమె సోదరుడు భాను ప్రకాశ్ కి కూడా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి భానుప్రకాశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కూలీ పనులు చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను పద్మ ఎంతో ప్రేమతో పెంచుతుంది. అలా చేతికి అందివచ్చిన చిన్నకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో పద్మ కన్నీటిపర్యంతమవుతోంది. ఎందుకు దేవుడా ఇలా చేశావు.. బైక్ పై బంధువుల ఇంటికి వెళ్లడమే మా బిడ్డ చేసిన తప్పా అంటూ బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి