iDreamPost

వీడియో: ట్రాఫిక్ పోలీసుని చూసి హెల్మెంట్ పెట్టుకున్నాడు! కానీ.., చివరిలో సూపర్ ట్విస్ట్!

Telangana Traffic Police: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటారు. అలానే తాజాగా చేసినా ఓ వినూత్న ప్రయోగం నవ్వులు పువ్వులతో పాటు అదుర్స్ అనిపించింది.

Telangana Traffic Police: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటారు. అలానే తాజాగా చేసినా ఓ వినూత్న ప్రయోగం నవ్వులు పువ్వులతో పాటు అదుర్స్ అనిపించింది.

వీడియో: ట్రాఫిక్ పోలీసుని చూసి హెల్మెంట్ పెట్టుకున్నాడు! కానీ.., చివరిలో సూపర్ ట్విస్ట్!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది.  అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా, ఆ వార్తలు క్షణాల్లో తెలిసిపోతుంటాయి. ఇక కొన్ని రకలా న్యూస్ లు చూసినట్పుపుడు.. ఆశ్చర్యం వేస్తుంది. మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి. ఇంకొన్ని వీడియోలు నవ్వుతో పాటు సూపర్ ఐడియా బాస్ అనేలా చేస్తాయి. తాజాగా పోలీసులు చేసిన ఓ వినూత్నమైన కార్యక్రమం నవ్వుల పువ్వులను పూయించడంతో పాటు కొందరు వాహనదారులకు భయం కలిగేలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

నేటికాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ ప్రమాదాలకు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే ప్రధాన కారణం. హెల్మెండ్ పెట్టుకోకపోవడం, మద్యం తాగి వాహనం నడపడం వంటివి చేస్తుంటారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అంతేకాక తరచూ రోడ్డుపై వాహనాలను తనిఖీలు చేస్తుంటారు. నిబంధనలు పాటించన వారికి చలనాలు రాస్తుంటారు. ఇలా పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కొందరిలో బుద్ధి మారడం లేదు. పోలీసులు ఉన్నప్పుడు బుద్దిమంతుల్లా హెల్మెంట్ ధరించి వెళ్తుంటారు. అదే వారు లేని సమయంలో రోడ్లపై ఇష్టానుసారంగా దూసుకెళ్తుంటారు. అంతేకాక మరికొందరు పోలీసుల కళ్లు గప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు.

ఇలా ట్రాఫిక్ నిబంధనలు పాటించన వారి విషయంలో పోలీసులు కొత్త పథాను అవలంభిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే అందుకు నిదర్శనం. చాలా మంది పోలీసులు లేకుంటే హెల్మెంట్ ఉన్న కూడా ధరించరు. బండి పెట్టుకుని వెళ్తుంటారు. ఇలా వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటారు. ఎంతో మంది హెల్మెంట్ తమతో పాటు తీసుకెళ్లి కూడా ధరించకుండా ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా వీడియోలో ట్రాఫిక్ పోలీసులు,  ఆ పక్కనే ఉన్న వాహనాన్ని ఓ బైకర్ దూరం నుంచి చూస్తాడు. ఇక వెంటనే బైక్ ను ఆపి.. హెల్మెంట్ ను ధరించి ముందుకు వెళ్తాడు.

ఆ పోలీసు వాహనం సమీపంలోకి వెళ్లే సరికి.. ఆ బైకర్ షాకి గురవుతాడు. కారణం.. అక్కడ  జస్ట్ ట్రాఫిక్ పోలీసులు, వాహనం ఆకారంలో బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మోసగాళ్లకే మోసగాళ్లు అనే నానుడి ఇప్పటి వరకు విన్నామే కానీ.. ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నామని తెలిపారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి