iDreamPost

DSC అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. నేడే దరఖాస్తుకు లాస్ట్! పరీక్ష తేదీలివే

TS DSC 2024: తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీకి..రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్ డేట్ వచ్చింది.

TS DSC 2024: తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీకి..రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్ డేట్ వచ్చింది.

DSC అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. నేడే దరఖాస్తుకు లాస్ట్! పరీక్ష తేదీలివే

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కొందరు అయితే గవర్నమెంట్ టీచర్ కావాలని కోరకుంటారు. ఇది ఇలా ఉంటే.. తెలంగాణలో ఉపాధ్యాయ  పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టెట్ ఫలితాలు కూడా వచ్చాయి ఈ క్రమంలోనే డీఎస్సీ దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్ డేట్ వచ్చింది. మరి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీకి..రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసింది. దీంతో చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇదే సమయంలో ఇంకా అప్లయ్ చేయని వారికి ఓ కీలక అలెర్ట్. నేటితో డీఎస్సీ దరఖాస్తు గడువు ముగియనున్నది. ఆన్ లైన్ ఫీజు చెల్లింపులు ప్రక్రియ బుధవారంతో ముగియగా.. నేటితో దరఖాస్తు నింపేందుకు గడువు గురువారంతో ముగుస్తుంది. బుధవారం అర్ధరాత్రి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,64,804 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు గురువారం రోజు ముగింపు సమయం  లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

2024 ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఇదే సమయంలో మార్చిలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే టెట్ ఫలితాల విడుదల కావడంతో మరికొందరు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20 వరకు విద్యాశాఖ పొడిగించింది. ఈ క్రమంలో టెట్‌- 2024లో క్వాలిఫై అయిన వారికి  డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

మిగతా వారు యథావిథిగా ఫీజులు చెల్లించాల్సిందే. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ముగింపు సమయం నాటికి డీఎస్సీ దరఖాస్తు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టెట్ ఫలితాలు రిలీజ్ కావడంతో.. డీఎస్సీ దరఖాస్తులో మార్పులకు కూడా అవకాశం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు 64,556 మంది అభ్యర్థులు తమ అప్లికేషన్లను సవరించుకున్నారు. ఇక డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ లో జరగనున్నాయి. మొత్తంగా ఈ సారి భారీగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి