iDreamPost
android-app
ios-app

అభిమానులకు వకీల్ సాబ్ షాక్ ?

  • Published Mar 18, 2020 | 5:33 AM Updated Updated Mar 18, 2020 | 5:33 AM
అభిమానులకు వకీల్ సాబ్ షాక్ ?

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని పాత ఎన్టీఆర్ సినిమా ‘మంచి మనసుకు మంచి రోజులు’లో ఓ పాటుంది. ఇప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ సాంగ్. అందుకే ఇటీవలే ఈ టైటిల్ తో ఏకంగా ఓ మూవీ కూడా వచ్చింది. ఇప్పుడీ మాట చెప్పడానికి కారణం ఉంది. ఎప్పుడెప్పుడు తమ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తామా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ తప్పేలా లేదు. ముందు అనుకున్న రిలీజ్ డేట్ మే 15 రీచ్ కావడానికి మెల్లగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. తాజాగా కోవిడ్ 19 వైరస్ వల్ల షూటింగులు, స్టూడియోలు అన్ని బంద్ కావడంతో దాని ప్రభావం వకీల్ సాబ్ మీద కూడా పడింది. నిజానికి ఏపీ పంచాయితీ ఎన్నికల వల్ల పవన్ షెడ్యూల్ బిజీగా ఉంటుంది కాబట్టి మామూలుగానే వకీల్ సాబ్ వాయిదా తప్పదనే టాక్ మూడు వారల క్రితమే వచ్చింది.

దిల్ రాజు ఆ విషయంగానే పవన్ తో వేగంగా షూట్ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడని కూడా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడీ కరోనా పరిణామాల వల్ల మొత్తం డిస్టర్బ్ అయ్యింది. ఈ లెక్కన పవర్ స్టార్ అనుకున్న టార్గెట్ చేరుకోవడం కష్టమేనని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఇదే జరిగితే జులై లేదా ఆపై ఆగస్ట్ కు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా అని ఇష్టం వచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. పోటీగా ఏమున్నాయో చూసుకోవాలి. వకీల్ సాబ్ కమర్షియల్ సినిమా కాదు. పింక్ రీమేక్ లో అవసరానికి అనుగుణంగా మార్పులు చేసినప్పటికీ ఇలాంటి కోర్ట్ డ్రామాలు మాస్ ప్రేక్షకులను అంత ఈజీగా ఆకట్టుకోవు. అందుకే సాధ్యమైనంత మేర సోలోగా రావడం చాలా అవసరం.

దిల్ రాజు ఇలాంటి విషయాల్లో తీసుకునే కేర్ అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. వాయిదా పడ్డ సినిమాల రీ షెడ్యూల్స్ ని బట్టి విడుదల తేదిలు ఖరారవుతాయి. అవన్నీ చూసుకుని వకీల్ సాబ్ కి సరైన డేట్ సెట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఓ పాట, కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలన్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇవన్ని పూర్తి చేసుకున్నాక పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తదితర తతంగాలు చాలా ఉంటాయి. ఈ నెలను మినహాయిస్తే ఆపై చేతిలో కేవలం 45 రోజులు మాత్రమే టైం ఉంటుంది. ఇంత తక్కువ స్పాన్ లో పవన్ రేంజ్ హీరో సినిమాను తీసుకురావడం అంత ఈజీ కాదు. సో అభిమానులు పోస్ట్ పోన్ కు ముందే ప్రిపేర్ అవ్వడం మంచిది.