iDreamPost
android-app
ios-app

ఇకపై టాలీవుడ్ లో అన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాలే

  • Published Nov 15, 2025 | 2:53 PM Updated Updated Nov 15, 2025 | 2:53 PM

ఈ మధ్య కాలంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు డివోషనల్ సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీనితో స్టార్ హీరోలు కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ , కల్కి లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఇలాంటి కంటెంట్ మీద ఓ ఐడియా వచ్చింది. ఇక ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా దాదాపు ఇలాంటి కంటెంట్ ఏ ఉండబోతుంది.

  • Published Nov 15, 2025 | 2:53 PMUpdated Nov 15, 2025 | 2:53 PM
ఇకపై టాలీవుడ్ లో అన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాలే

ఈ మధ్య కాలంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు డివోషనల్ సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీనితో స్టార్ హీరోలు కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ , కల్కి లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఇలాంటి కంటెంట్ మీద ఓ ఐడియా వచ్చింది. ఇక ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా దాదాపు ఇలాంటి కంటెంట్ ఏ ఉండబోతుంది. చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ, సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందినదే.

అలాగే ఈ సంక్రాంతికి రాబోయే రాజాసాబ్ కూడా ఇలాంటి జోనర్ ఏ. పీరియాడికల్‌ హారర్‌ కామెడీ, సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుంది. హర్రర్ కామిడికి ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా తీస్తాడా అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఇప్పుడు అట్లీతో సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ సినిమా షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. . ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై తీసుకుని వస్తామని అట్లీ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక హనుమాన్ సిక్వెల్ గా రానున్న జై హనుమాన్ కూడా ఇదే కోవలోకి రానుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య హీరోగా చేస్తున్న న్యూ మూవీ ఎన్ సి 24( వర్కింగ్ టైటిల్) లో నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. ఇది మైథలాజికల్ థ్రిల్లర్, సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందించబోతున్నారట. ఇలా టాలీవుడ్ హీరోలంతా సైన్స్ ఫిక్షన్ బాట పడుతున్నారు. ఇక ముందు ముందు ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.