iDreamPost
iDreamPost
వచ్చే ఏడాది 2021 సంక్రాంతికి మొదటి కర్చీఫ్ వేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ రేస్ నుంచి తప్పుకున్నారని చెన్నై అప్డేట్. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నాతే మీద సౌత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ కు ముందే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ కరోనా లాక్ డౌన్ సమయంలో రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించింది. అయితే తమిళనాడులో వైరస్ ఉధృతి ఎంతకూ తగ్గడం లేదు. అందులోనూ చెన్నైలో ఈ భూతం విచ్చలవిడిగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో షూట్స్ కొనసాగించడం జరిగే పనిలా కనిపించడం లేదు. అందులోనూ రజని వయసు దృష్ట్యా సన్ పిక్చర్స్ రిస్క్ చేసేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేదు.
అన్నాతే తెలుగు, మలయాళం వర్షన్లకు సంబంధించి ఇంకా బిజినెస్ కూడా మొదలుకాలేదు. గత కొన్నేళ్లుగా రజని మార్కెట్ బాగా దెబ్బ తిన్నందున మన నిర్మాతలు హక్కుల కోసం ఎగబడటం లేదు. ఇప్పుడు కరోనా వల్ల ఆర్థికంగా తీవ్ర అల్లకల్లోలం చెలరేగింది కాబట్టి భారీ పెట్టుబడి అంటే ససేమిరా అంటారు. ఈ కారణాల వల్ల అన్నాతేని సంక్రాంతికి బదులు సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తారట. అప్పుడు ఆర్ఆర్ఆర్ ఫిక్స్ అయితే తేదీ మారుస్తారా లేక పోటీకి సై అంటారా అనేది తేలడానికి చాలా టైం పడుతుంది. కీర్తి సురేష్, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న అన్నాతేలో నిన్నటి తరం బ్యూటీస్ మీనా, ఖుష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. మొదటసారి ఇమ్మాన్ రజని సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
ఇప్పుడు స్లాట్ ఖాళీ అయింది కాబట్టి ఒకవేళ విజయ్ మాస్టర్ కనక దీపావళికి రావడం సాధ్యం కాకపోతే దాన్ని అతను తీసుకుంటాడు. తెలుగులో మాత్రం గందరగోళం అలాగే కొనసాగుతోంది. నాని వి లాంటి క్రేజ్ ఉన్న మూవీతో మొదలుకుని యాంకర్ ప్రదీప్ హీరోగా డెబ్యూ చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా దాకా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాది రిలీజ్ కావాల్సినవే. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, నాగార్జున వైల్డ్ డాగ్, బాలకృష్ణ బిబి 3 ఇవన్నీ ఆలస్యమయ్యేలాగే ఉన్నాయి. వయసు దృష్ట్యా ఈ హీరోలు షూటింగులకు అంత సుముఖంగా లేరు. 2021 సంక్రాంతిని చూస్తుంటే తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సందర్భం ఎదురు కాలేదన్నది మాత్రం వాస్తవం