iDreamPost
android-app
ios-app

Salaar: ‘సలార్’పై మరింత హైప్ పెంచుతున్న ప్రశాంత్ నీల్.. ఆ సీన్లు యాడ్ చేయడంతో..!

  • Published Dec 13, 2023 | 10:15 PM Updated Updated Dec 13, 2023 | 10:15 PM

క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ మూవీ త్వరలో విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ మూవీ త్వరలో విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

  • Published Dec 13, 2023 | 10:15 PMUpdated Dec 13, 2023 | 10:15 PM
Salaar: ‘సలార్’పై మరింత హైప్ పెంచుతున్న ప్రశాంత్ నీల్.. ఆ సీన్లు యాడ్ చేయడంతో..!

‘సలార్’.. ఇప్పుడీ సినిమా మేనియాతో దేశం మొత్తం ఊగిపోతోంది. రిలీజ్​కు ముందే రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రంపై బజ్ ఆకాశాన్ని అంటుతోంది. ఇంకా థియేటర్లలోకి వచ్చాక రచ్చ ఏ లెవల్లో ఉంటుందో ఊహిస్తేనే గూస్​బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఒక్క ప్రెస్ మీట్, ఇంటర్వ్యూ, ప్రమోషనల్ వీడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ గానీ ఏదీ లేదు. అయినా ‘సలార్’ మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతుండటానికి కారణం కాంబినేషన్ అనే చెప్పాలి. ‘కేజీఎఫ్’ సిరీస్​తో పాన్ ఇండియా వైడ్​గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వహిస్తుండటం, ‘బాహుబలి’తో నేషనల్ వైడ్ స్టార్​గా అవతరించిన ప్రభాస్ నటిస్తుండటంతో ‘సలార్’ మీద ఎక్స్​పెక్టేషన్స్ ఈ రేంజ్​లో ఉన్నాయి. ఈ డెడ్లీ కాంబోలో వస్తున్న ఫిల్మ్ కావడంతో అన్ని భాషల్లోనూ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.

సాధారణంగానే సినిమా గురించి ఎక్కువగా మాట్లాడని ప్రశాంత్ నీల్ ‘సలార్’ విషయంలోనూ సైలెంట్​గానే ఉన్నారు. డిసెంబర్ 22న ఆడియెన్స్ ముందుకు రానుంది ప్రభాస్ మూవీ. అయినా అటు రెబల్ స్టార్, ఇటు నీల్ మామ ఇద్దరూ మౌనంగానే ఉంటున్నారు. కేవలం టీజర్స్, ట్రైలర్స్, సాంగ్ రిలీజ్ చేస్తూ చిత్రం మీద బజ్ పెంచుతున్నారు. కానీ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు గానీ ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ గానీ నిర్వహించడం లేదు. దీంతో ‘సలార్​’కు ఓపెనింగ్స్ పెద్దగా రావేమోనని కొందరు డౌట్ పడుతున్నారు. కానీ సినిమా మీద బజ్ మామూలుగా లేదు. ప్రీ బుకింగ్స్ వేరే లెవల్లో ఉన్నాయని తెలుస్తోంది. బ్లాక్​బస్టర్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే కలెక్షన్స్​ రికార్డును ప్రభాస్ మూవీ ఈజీగా కొట్టేస్తుందని వినిపిస్తోంది.

ఇప్పటికే ఫుల్ బజ్​ ఉన్నప్పటికీ దాన్ని మరింత పెంచేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నారు. రీసెంట్​గా ‘సలార్’ ఫైనల్ కాపీని రీ-సెన్సార్ చేయించారాయన. లేటెస్ట్ ప్రింట్ ప్రకారం మూవీ డ్యూరేషన్ 177 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ప్రింట్​లో ఫుల్ వయొలెంట్ సీన్స్ కొన్నింటిని నీల్ మామ యాడ్ చేశారట. ఆ యాక్షన్ సీక్వెన్సులు రక్తపాతంతో ఉంటాయని టాక్. దీంతో థియేటర్లలో రెబల్ ఫ్యాన్స్​కు పండుగేనని నెటిజన్స్ అంటున్నారు. ప్రభాస్ మామూలుగా ఫైట్ చేస్తేనే అదిరిపోతుందని.. అలాంటిది ఫుల్ వయొలెన్స్ సీన్స్ అయితే థియేటర్లలో బ్లాస్టింగ్ ఎక్స్​పీరియెన్స్ ఉంటుందని చెబుతున్నారు. హైప్ పెంచడానికి నీల్ మామ చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందని అంటున్నారు. మరి.. ప్రభాస్-ప్రశాంత్ నీల్​ల ‘సలార్’ రిలీజ్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Prabhas-Mahesh Babu: గుంటూరు కారం, సలార్ రెండిట్లో ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది?

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinofast girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom