iDreamPost

Prabhas-Mahesh Babu: గుంటూరు కారం, సలార్ రెండిట్లో ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది?

ప్రస్తుతం యూట్యూబ్ ను రెండు పాటలు షేక్ చేస్తున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీలోది కాగా.. ఇంకోటి డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీలోని 'సూరీడే' పాట.

ప్రస్తుతం యూట్యూబ్ ను రెండు పాటలు షేక్ చేస్తున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీలోది కాగా.. ఇంకోటి డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీలోని 'సూరీడే' పాట.

Prabhas-Mahesh Babu: గుంటూరు కారం, సలార్ రెండిట్లో ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది?

సలార్, గుంటూరు కారం.. ఈ రెండు మూవీలు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. అదేంటి సలార్ వచ్చేది డిసెంబర్ 22, గుంటూరు కారం వచ్చేది జనవరి 12న ఈ రెండు సినిమాలు ఎలా పోటీ పడతాయి అన్న డౌట్ మీకు రావొచ్చు. అయితే ఈ బిగ్ స్టార్స్ పోటీ పడేది పాటల విషయంలో. అవును రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది గుంటూరు కారం టీమ్ ప్రమోషన్లను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇక ఇటు సలార్ మాత్రం కేవలం ప్రభాస్ తో ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఒక్కటే ఉండబోతోంది అంటూ హింట్ ఇచ్చారు. అయితే ఫ్యాన్స్ నిరాశ పడకుండా సలార్ నుంచి ‘సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి’ అనే సాంగ్ ను బుధవారం రిలీజ్ చేసింది. ఇక అటు మహేశ్ సైతం ‘ఓ మై బేబీ’ అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశాడు. ఈ రెండూ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తూ.. ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తాజాగా ‘ఓ మై బేబీ’ అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి అందించిన అద్భుతమైన పదాలకు.. అంతే అద్భుతంగా సంగీతం సమకూర్చాడు థమన్. ఓ అమ్మాయి, ఓ అబ్బాయితో కబుర్లు ఎలా చెప్పాలి అనుకుంటుందో పాట ద్వారా చక్కగా వివరించాడు రామజోగయ్య శాస్త్రి. తన కోయిల గొంతుతో సూపర్ గా ఈ పాటను ఆలపించింది సింగర్ శిల్పారావ్. ఇక త్రివిక్రమ్ సినిమా అంటేనే ఇలాంటి సాంగ్ లకు పెట్టింది పేరు. తన ప్రతీ మూవీలో ఇలాంటి రొమాంటిక్ పాటను పెడుతూ.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు గురూజీ. కాగా.. విడుదలైన కొన్న గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సాధిస్తూ.. ట్రెండింగ్ లోకి వెళ్లింది సూపర్ స్టార్ సాంగ్.

మరోవైపు సలార్ ఓ డిఫరెంట్ పాటను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఇది డిఫరెంట్ పాటే కాదండోయ్ ఈ పాటలోనే సినిమా కథ మెుత్తం చెప్పేశాడు లిరిక్ రైటర్ కృష్ణకాంత్(KK). ‘సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి’ అంటూ తన ఫ్రెండ్ ను 24 గంటలు కంటికి రెప్పలా దేవ ఎలా కాపాడుకుంటాడో ఈ ఒక్క పాటలోనే ప్రేక్షకులకు తెలియజెప్పాడు. ఫ్రెండ్షిప్ పాటల్లో ఈ పాటకు మించిన మరోసాంగ్ రాదంటే అతిశయోక్తికాదు. అంతలా లిరిక్స్ గుండెలను హత్తుకుంటాయి.. మనసును మెలిపెడతాయి.. బుర్రలో తిరుగుతాయి. ఈ పాటతో కృష్ణకాంత్ మరో మెట్టు పైకెక్కాడనే చెప్పాలి. ఇక అతడి పదాల కనికట్టుకు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు రవి బస్రూర్. హరిని ఇవటురి తన గొంతుతో మాయ చేసింది. ప్రస్తుతం ఈ రెండు సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ రెండు పాటల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి