Nidhan
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన నయా ఫిల్మ్ ‘భీమా’. మహాశివరాత్రి కానుకగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన నయా ఫిల్మ్ ‘భీమా’. మహాశివరాత్రి కానుకగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
మాచో స్టార్ గోపీచంద్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓ మంచి సక్సెస్‌తో తిరిగి గాడిలో పడాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన కొత్త చిత్రం ‘భీమా’ మహాశివరాత్రి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కన్నడ డైరెక్టర్ ఏ హర్ష ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. పురాణాల్లోని పరశురాముడి కథా నేపథ్యంగా రూపొందిన పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లరే ‘భీమా’. ప్రమోషన్స్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
‘భీమా’కు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా వసూళ్లు ఏ రేంజ్లో ఉంటాయనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. విడుదలకు ముందు బజ్ బాగుండటంతో మేకర్స్ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గోపీచంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్క్రీన్స్‌లో విడుదల చేశారు. నైజాం, ఆంధ్రాలో కలిపి 600 స్క్రీన్స్, రెస్టాఫ్ ఇండియా 100 స్క్రీన్స్, ఓవర్సీస్లో 200 స్క్రీన్స్‌లో కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్స్‌లో ‘భీమా’ను రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఊహించినంత కాకపోయినా పాజిటివ్ ఓపెనింగ్స్ రాబట్టింది గోపీచంద్ ఫిల్మ్. యూఎస్ఏ, ఇతర ఏరియాల్లో కలిపి ఫస్ట్ డే రూ.1.25 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.1.30 కోట్లు నికరంగా వసూలు చేసిందని ట్రేడ్ సమాచారం.
‘భీమా’ మొత్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని తొలి రోజు రూ.3 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తెలుస్తోంది. గోపీచంద్ గత చిత్రం ‘రామబాణం’ మూవీ డే 1 రూ.2.5 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో పోలిస్తే ‘భీమా’కు పాజిటివ్ స్టార్ట్ లభించింది. లాంగ్ వీకెండ్ ఉండటం, రెండో శనివారం, ఆదివారం సెలవులు కలసిరావడం, మంచి టాక్ కూడా రావడం, ఎక్కువ స్క్రీన్స్‌లో రిలీజ్ అవడంతో గోపీచంద్ మూవీకి వసూళ్లు భారీగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.25 కోట్లుగా సెట్ చేశారని ట్రేడ్ టాక్. దీంతో ఈ మూవీ హిట్ స్టేటస్ తెచ్చుకోవాలంటే ఇంకో వారం వరకు మంచి రన్‌ను కొనసాగించాలి. అయితే విశ్వక్సేన్ ‘గామి’ నుంచి పోటీని తట్టుకోవడం కష్టంగానే ఉంది. మరి.. గోపీచంద్ కొత్త చిత్రాన్ని మీరు చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: పేరు మార్చుకొన్న సాయిధరమ్ తేజ్.. కొత్త పేరు ఏంటో తెలుసా?