iDreamPost
android-app
ios-app

Baahubali : బ్లాక్ బస్టర్ మూడో భాగం గురించి రాజమౌళి

  • Published Mar 14, 2022 | 4:30 PM Updated Updated Dec 18, 2023 | 5:57 PM

దుబాయ్, బెంగళూర్ ఈవెంట్ల తాలూకు పనుల్లో టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పబ్లిసిటీ క్యాంపైన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు.

దుబాయ్, బెంగళూర్ ఈవెంట్ల తాలూకు పనుల్లో టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పబ్లిసిటీ క్యాంపైన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు.

Baahubali : బ్లాక్ బస్టర్ మూడో భాగం గురించి రాజమౌళి

ఇవాళ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు వేగమందుకోబోతున్నాయి. రాజమౌళి రంగంలోకి దిగారు. దుబాయ్, బెంగళూర్ ఈవెంట్ల తాలూకు పనుల్లో టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పబ్లిసిటీ క్యాంపైన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. అందులో భాగంగా జక్కన్న బాహుబలి 3 ప్రస్తావన తేవడం, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనే హింట్ ఇవ్వడం ప్రభాస్ అభిమానులను ఒక్కసారిగా యాక్టివ్ చేసింది. దీనికోసం తమ వద్ద ప్రణాళిక ఉందని, టైం వచ్చినప్పుడు తెరకెక్కించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పడంతో నిజంగా ఇది సాధ్యమేనా అనే చర్చ మొదలయ్యింది.

ప్రాక్టికల్ గా చూస్తే బాహుబలి లాంటి ల్యాండ్ మార్క్ మూవీకి కల్ట్ ఫాలోయింగ్ శాశ్వతంగా ఉంటుంది. రెండు భాగాలు విపరీతమైన ఆదరణకు నోచుకున్న నేపథ్యంలో థర్డ్ పార్ట్ వచ్చినా చూడరనే ఇబ్బంది ఉండదు. కాకపోతే అంత గ్యాప్ తర్వాత మునుపు ఉన్న ఎగ్జైట్ మెంట్ ఉంటుందా అన్నదే ప్రశ్న. పైగా ఆర్ఆర్ఆర్ అయ్యాక రాజమౌళి మహేష్ బాబు మూవీ మొదలుపెట్టాలి. ఇదెంత కాలం తీస్తారో తెలియదు. అసలే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, గ్రాండ్ విజువల్స్, డిఫరెంట్ సెటప్ అంటూ ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఎంత లేదన్నా కనీసం రెండేళ్లకు పైగా షూటింగ్ కే పోతుంది. ఆపై ఎలాంటి అడ్డంకులు లేకుంటే ఆ టైంకి రిలీజ్ అవుతుంది.

అప్పటికి ప్రేక్షకుల్లో బాహుబలి 3 పట్ల ఉత్సుకత ఉంటుందా అంటే చెప్పలేం. అసలే రాజమౌళి మేజిక్ మార్కెటింగ్ కి గురువు. సబ్జెక్టు ఏదైనా హీరో ఎవరైనా సరే మాస్ ని లాగడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అలాంటిది పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో మరోసారి జట్టు కడితే ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. ఎలాగూ ఆర్టిస్టులందరూ అందుబాటులో ఉన్నారు. చక్కగా చేసుకోవచ్చు. బాహుబలికి ముందు జరిగిన కథ చెబుతారా లేక రానా చనిపోయాక బాహుబలి తన సామ్రాజ్యాన్ని ఎలా పాలించాడనే పాయింట్ మీద తీసుకుంటారా అనేది వేచి చూడాలి. మొత్తానికి మరోసారి బాహుబలి లైమ్ లైట్ లోకి రావడం విశేషం

Also Read : Ravi Teja : రవితేజ తీసుకుంటున్న మెగా ప్యాకేజ్