iDreamPost
android-app
ios-app

Ravi Teja : రవితేజ తీసుకుంటున్న మెగా ప్యాకేజ్

  • Published Mar 14, 2022 | 2:30 PM Updated Updated Mar 14, 2022 | 2:30 PM
  • Published Mar 14, 2022 | 2:30 PMUpdated Mar 14, 2022 | 2:30 PM
Ravi Teja : రవితేజ తీసుకుంటున్న మెగా ప్యాకేజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ ని ఏప్రిల్ లోనే మొదలుపెట్టబోతున్నారట. చిరు రవి కాంబినేషన్లో వచ్చే సీన్లతో పాటు తనకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఇరవై రోజుల కాల్ షీట్స్ తో పూర్తి చేసేలా ప్లానింగ్ జరిగినట్టు సమాచారం. ఇందులో హీరోకు తమ్ముడిగా రవితేజ కనిపిస్తారని ఇన్ సైడ్ టాక్. మూవీ మొత్తం పాత్ర ఉంటుందా లేక స్పెషల్ క్యారెక్టర్ తరహాలో ఓ అరగంట దాకా ఉంటుందా అనేది వేచి చూడాలి. బడ్జెట్ పరంగా భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య టైటిల్ ప్రచారంలో ఉంది.

యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఇందులో నటించినందుకు గాను రవితేజ రెమ్యునరేషన్ 10 కోట్లనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా మాస్ రాజా తన ఫుల్ లెన్త్ రోల్స్ కి 16 నుంచి 20 కోట్ల మధ్యలో తీసుకుంటారు. అంతకన్నా ఎక్కువ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇందులో స్పేస్ లిమిటెడ్ కాబట్టి దానికి తగ్గట్టే ఫిక్స్ చేసినట్టు వినికిడి. చిరంజీవితో అన్నయ్యలో నటించిన రవితేజ అప్పటికి స్టార్ హీరో కాదు. పెద్ద రేంజ్ వచ్చాక శంకర్ దాదా జిందాబాద్ లో ఓ పాటలో అలా తళుక్కున మెరిశారు. మళ్ళీ ఈ కాంబో సాధ్యపడనే లేదు. ఇన్నేళ్లకు అభిమానుల కోరిక నెరవేరనుంది.

అప్పట్లో అన్నయ్యకు రవితేజ పారితోషికంతో పోలిస్తే ఇప్పుడు ఇస్తున్నది ఎంత పెద్ద మొత్తమో ఆ తేడానే తను పడిన కష్టాన్ని, చేరుకున్న స్థాయిని సూచిస్తుంది. తన పూర్తి స్టామినాతో చిరంజీవికి దీటుగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తే అంతకంటే కిక్ ఫ్యాన్స్ కి ఇంకేముంటుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన జోడి ఉంటుందా లేదా ఇంకా తెలియదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం దీనికి స్పెషల్ అట్రాక్షన్. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి మాస్ క్యారెక్టరైజేషన్ లో డాన్ గా కనిపిస్తారనే ప్రచారం కూడా ఉంది. 2023 విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర క్యాస్టింగ్ తెలియాల్సి ఉంది

Also Read : Radhe Shyam 3 Days Collections : టార్గెట్ ఇంకా చాలా దూరం డార్లింగ్

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio