iDreamPost
android-app
ios-app

రాజా సాబ్ వచ్చేస్తున్నాడు.. డేట్స్ ఇవేనా!

  • Published Jun 03, 2025 | 10:30 AM Updated Updated Jun 03, 2025 | 11:06 AM

Rajasaab: రాజా సాబ్ నుంచి ఓ గ్లిమ్ప్స్ , పోస్టర్స్ రిలీజ్ చేసి అదిగో ఇదిగో అంటూ సినిమా కోసం కొద్దీ రోజులు హడావిడి చేసి. మళ్ళీ మాయమైపోయారు మేకర్స్. దీనితో ప్రేక్షకులు కూడా సరేలే వచ్చినప్పుడే వస్తుంది అని లైట్ తీసుకున్నారు. కానీ గత కొద్దీ రోజుల నుంచి మరోసారి రాజాసాబ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Rajasaab: రాజా సాబ్ నుంచి ఓ గ్లిమ్ప్స్ , పోస్టర్స్ రిలీజ్ చేసి అదిగో ఇదిగో అంటూ సినిమా కోసం కొద్దీ రోజులు హడావిడి చేసి. మళ్ళీ మాయమైపోయారు మేకర్స్. దీనితో ప్రేక్షకులు కూడా సరేలే వచ్చినప్పుడే వస్తుంది అని లైట్ తీసుకున్నారు. కానీ గత కొద్దీ రోజుల నుంచి మరోసారి రాజాసాబ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

  • Published Jun 03, 2025 | 10:30 AMUpdated Jun 03, 2025 | 11:06 AM
రాజా సాబ్ వచ్చేస్తున్నాడు.. డేట్స్ ఇవేనా!

రాజా సాబ్ కోసం ప్రేక్షకులు ఏ రకంగా వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. ప్రభాస్ అభిమానులకైతే ఈ క్యూరియాసిటి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఓ గ్లిమ్ప్స్ , పోస్టర్స్ రిలీజ్ చేసి అదిగో ఇదిగో అంటూ సినిమా కోసం కొద్దీ రోజులు హడావిడి చేసి. మళ్ళీ మాయమైపోయారు మేకర్స్. దీనితో ప్రేక్షకులు కూడా సరేలే వచ్చినప్పుడే వస్తుంది అని లైట్ తీసుకున్నారు. కానీ గత కొద్దీ రోజుల నుంచి మరోసారి రాజాసాబ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక తాజాగా రాజాసాబ్ వచ్చేస్తున్నాడంటూ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారంటూ టాక్ వినిపిస్తుంది.

ఈ నెల అంటే జూన్ 15న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారట. ఈ టీజర్ లోనే మూవీ రిలీజ్ డేట్ ను రివీల్ చేస్తారట. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ డేట్ డిసెంబర్ 12 అని వినిపిస్తుంది. ఆ నెలలో అంటే డిసెంబర్ 25న అడవిశేష్ డెకాయిట్ సినిమా రిలీజ్ కానుంది. సో బిజినెస్ కోణంలో అదే నెలలో మిడిల్ లో రిలీజ్ చేయడం బెస్ట్ అని అనుకుంటున్నారట మేకర్స్. ఈ రిలీజ్ డేట్ అఫీషియల్ ఆ కాదా అనేది చెప్పలేము. కానీ నిజం అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలానే ఉన్నాయి. ఇంకా కొంతమేరకు షూటింగ్ మిగిలి ఉందట. ఇప్పటివరకు సినిమా మీద ఉన్న అంచనాలు వేరని.. టీజర్ చూసాక అంచనాలు వేరుగా ఉంటాయని.. ఆశించిన దానికంటే ఎక్కువ బిజినెస్ డీల్ జరుగుతుందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉన్నట్లు సమాచారం.

ఒకవేళ డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తే బిజినెస్ పరంగా బాగానే ఉంటుంది. సంక్రాంతి కంటే ముందే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మొత్తంలో రాబట్టొచ్చు. అయినా అసలు అక్కడ ఉన్నది ప్రభాస్ సినిమా. సో కరెక్ట్ కంటెంట్ తో ఏ నెలలో వచ్చినా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet