బట్ట కాల్చి మొహం మీద పడేయడమనే నానుడి మాదిరిగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగితే దాని పూర్వా పరాలు తెలుసుకోకుండా.. వెంటనే ప్రభుత్వాన్ని నిందించడం, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా జరుగుతోంది. సదరు ఘటనలు జరిగిన సమయంలో ఆరోపణలు, విమర్శలతో హడావుడి చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ.. ఆ తర్వాత జరిగే పరిణామాలపై మాత్రం మౌనం పాటిస్తోంది. ఇటీవల జరిగిన పలు ఘటనలను […]
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై టీడీపీ,బీజేపీ నేతల విషప్రచారాలకు, వాస్తవానికి పొంతన లేదని కేంద్రమంత్రి పరోక్షంగా తేల్చేశారు. తాజాగా బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు దానికి నిదర్శనం. మోడీ మంత్రివర్గ సహచరుడే నేరుగా టీటీడీ పాలకమండలి ప్రయత్నాలను అభినందించిన తీరు ఆసక్తికరం. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. తిరుమల వేదికగా మతరాజకీయాలు విపక్షాల సృష్టి అని ఆయన మండిపడ్డారు. […]
ప్రపంచం నలుమూలలా ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. స్వామి వారిని ఏడాదిలో ఒకసారైనా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు ఆశిస్తాడు. దేశ విదేశాల్లో ఉన్న స్వామి వారి భక్తులకు ఆ అవకాశం లభించకపోయినా శ్రీవారి నిత్య కైంకర్యాలు, ఇతర కార్యక్రమాలు అన్నీ నిత్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ద్వారా వీక్షిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. ప్రస్తుతం ఎస్వీబీసీ ఛానెల్లో స్వామి వారి కైంకర్యాలు, కళ్యాణం, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలన్నీ […]
ఎట్టకేలకు సప్తగిరి మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం పైన చెలరగిన వివాదం సద్దుమణిగింది. రామాయణంలో సీతకు లవుడు మాత్రమే కుమారుడని, కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ ప్రచురితమైన వ్యాసంతో కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన టి.టి.డి అధికారులు ఈ వ్యవహారం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోరగా , రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సప్తగిరి పత్రిక ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్లను విచారించారు. […]
కరోనా వైరస్ వల్ల రెండు నెలలకు పైగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కోల్పోయిన భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రార్థనామందిరాలు తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 8,9 తేదీత్లో కొండపై ఉన్న టీటీడీ ఉద్యోగులకు, 10వ తేదీలో స్థానికులకు, 11వ తేదీ […]
తమకు ఇష్టం లేని వాళ్లు ఎలాంటి మంచి పనులు చేసినా కొందరికి కనిపించవు. వినిపించవు. పైగా విపరీతమైన రాజకీయ కడుపు మంటతో బాధపడుతూ.. ఆ అసహనాన్ని ఇతరులపై నిందలు వేయడం ద్వారా తగ్గించుకోవడానికి చూస్తారు. అలాంటి కోవలోకే చెందుతారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ను వాడు వీడు అంటూ చులకనతో మాట్లాడడంతోపాటు లేనిపోని అభాండాలు వేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో జేసీ […]
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు భక్తులు ఇచ్చిన ఆస్తుల్లో నిరర్ధకరమైన వాటిని విక్రయించే విధానంపై శాశ్వత నిషేధం విధిస్తూ తీర్మానించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీకి చెందిన 50 నిరర్ధక ఆస్తులను అమ్మేందుకు అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయంపై ఇటీవల సమీక్ష చేసిన సందర్భంగా అదే తెలుగుదేశం, బీజేపీ నేతలు వివాదాస్పదం చేసిన విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా టీటీడీకి […]
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల విక్రయాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆస్తుల ప్రక్రియను నిలిపివేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వేలం నిర్వహణకు సంబంధించి నియమించిన రెండు బృందాలను రద్దు చేశారు. శ్రీవారి ఆస్తుల వేలం వేయాలని 2016లో అప్పటి పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ నిన్న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. […]
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన పలు నిరర్థక ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో లోతైన చర్చ, ధార్మిక సంస్థలో సమాలోచనలు తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ఈ విషయంలో టీటీడీ చైర్మన్ కూడా దాదాపు ఇదే నిర్ణయాన్ని వెలువరించారు. తాము శ్రీవారి ఆస్తుల […]
కరొనా కల్లోలంలో ప్రజలను ఆడుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరొనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా టీటీడీ అందించనున్న సహాయ సహాకారాల గురించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక అలమటిస్తున్న పేదలకు, అనాధలకు, ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలకు నిరంతరాయంగా […]