Idream media
Idream media
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల విక్రయాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆస్తుల ప్రక్రియను నిలిపివేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వేలం నిర్వహణకు సంబంధించి నియమించిన రెండు బృందాలను రద్దు చేశారు.
శ్రీవారి ఆస్తుల వేలం వేయాలని 2016లో అప్పటి పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ నిన్న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన స్థిర ఆస్తుల్లో నిరర్థకమైన వాటిని విక్రయించాలని టీటీడీ రూట్ మ్యాప్ సిద్ధం చేయడంతో భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాలను రద్దు చేస్తూ అటు ప్రభుత్వం, ఇటు టీటీడీ నిర్ణయం తీసుకోవడం విశేషం.