Swetha
గత రెండు మూడు నెలలుగా రిలీజ్ అయినా ఏ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదన్న మాట వాస్తవం. అది పెద్ద హీరోల సినిమాలైనా చిన్న హీరోల సినిమాలైనా మిడ్ రేంజ్ హీరోల సినిమాలైనా సరే. కొన్ని పెద్ద హీరోల సినిమాలైతే రిలీజ్ తర్వాత మరీ నీరు కారిపోయినట్టు అయిపోయాయి.
గత రెండు మూడు నెలలుగా రిలీజ్ అయినా ఏ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదన్న మాట వాస్తవం. అది పెద్ద హీరోల సినిమాలైనా చిన్న హీరోల సినిమాలైనా మిడ్ రేంజ్ హీరోల సినిమాలైనా సరే. కొన్ని పెద్ద హీరోల సినిమాలైతే రిలీజ్ తర్వాత మరీ నీరు కారిపోయినట్టు అయిపోయాయి.
Swetha
గత రెండు మూడు నెలలుగా రిలీజ్ అయినా ఏ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదన్న మాట వాస్తవం. అది పెద్ద హీరోల సినిమాలైనా చిన్న హీరోల సినిమాలైనా మిడ్ రేంజ్ హీరోల సినిమాలైనా సరే. కొన్ని పెద్ద హీరోల సినిమాలైతే రిలీజ్ తర్వాత మరీ నీరు కారిపోయినట్టు అయిపోయాయి. దీనితో అటు డిస్ట్రిబ్యూటర్స్ , థియేటర్ ఓనర్స్ కు నిరాశ తప్పలేదు. ఇటు ప్రేక్షకుల పరిస్థితి కూడా ఇంచుమించు అలానే కనిపిస్తుంది. ఎదో తమ హీరో స్టేటస్ పడిపోకూడదని సినిమాలకు వెళ్తున్నారే తప్ప.. వాస్తవానికి వారికి కూడా ఆయా సినిమాల విషయాలలో ఎలాంటి శాటిస్ఫ్యాక్షన్ లేదు. ఇక ఇప్పుడు వీరికి మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆశ ఓజి.
ఆల్రెడీ ఓజి కోసం పవన్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలియనిది కాదు. మరోవైపు హరి హర చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది.. దీనితో వీలైనంత త్వరగా వారిని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురడానికి.. ఓజి మేకర్స్ పక్కా ప్రణాలికను సిద్ధం చేస్తున్నారు. సరిగ్గా ఓజి రిలీజ్ కు నెల రోజుల సమయం ఉంది. ఈ నెల రోజుల వ్యవధిలో ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచేందుకు వరుస అప్డేట్స్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో ఓజి కౌంట్ డౌన్ ఇక మొదలైనట్టే.
తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుందట ఓజి. ఒకవేళ పాజిటివ్ టాక్ కనుక వస్తే ఇక సినిమాకు తిరుగులేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . సినిమాకు బజ్ అయితే బాగానే ఉంది. కానీ ఎంత బజ్ ఉన్నా సరే ప్రమోషన్స్ నిర్లక్ష్యం చేస్తే కష్టమే. ప్రమోషన్స్ వలన ఇంకాస్త ఓపెనింగ్స్ పెరిగే అవకాశం ఉంది. పైగా డేట్ కూడా సోలో అయిపొయింది. దాదాపు బాలకృష్ణ అఖండ 2 రేస్ నుంచి తప్పుకున్నట్లే. సో ఈ సోలో డేట్ ను ఓజి బాగానే యూజ్ చేసుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.