Swetha
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వార్ 2 తర్వాత ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ మీదే ఉన్నాయి. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తారక్ అభిమానులు.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వార్ 2 తర్వాత ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ మీదే ఉన్నాయి. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తారక్ అభిమానులు. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేశారట. దానికోసం హిందీ వెర్షన్ లో ఓ హిందీ హీరోని , తమిళ వెర్షన్ లో ఓ తమిళ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మూవీ టీం.
రీసెంట్ గా కూలీ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాలో సౌత్ నుంచి నాగార్జున కన్నడ నుంచి ఉపేంద్ర మలయాళం నుంచి సౌబిన్ ఇలా నటించారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఇదే ఫార్ములా ఉపయోగిస్తున్నాడా అనే సందేహాలు సినీ క్రిటిక్స్ లో మొదలవుతున్నాయి.ఇక దీనిలో ఎంతవరకు నిజం ఉంది.. అసలు కథ ఎంతవరకు వచ్చింది అనేది తెలియాలంటే దర్శకుడు నోరు విప్పాల్సిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా తీర్చిదిద్దాలనేది ప్రశాంత్ నీల్ లక్ష్యం. అందుకోసమే దీనికోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడట. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలలో ఈ సినిమానే ది బెస్ట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదని ఇన్సైడ్ టాక్. ఇక ముందు ముందు మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.