iDreamPost
android-app
ios-app

మిరాయ్ రాక అప్పుడు కష్టమేనా !

  • Published Aug 25, 2025 | 11:39 AM Updated Updated Aug 25, 2025 | 11:41 AM

నిజానికి సెప్టెంబర్ 5 డేట్ ను అన్నిటికంటే ముందు లాక్ చేసుకుంది మిరాయ్ సినిమానే. కాబట్టి అసలు ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పిన టైం కి సినిమా వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య ఏ సినిమా ఎప్పుడు వాయిదా పడుతుందో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఆ సినిమా థియేటర్స్ లోకి వచ్చే ముందు రోజు వరకు కూడా నమ్మకం ఉండడం లేదు.

నిజానికి సెప్టెంబర్ 5 డేట్ ను అన్నిటికంటే ముందు లాక్ చేసుకుంది మిరాయ్ సినిమానే. కాబట్టి అసలు ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పిన టైం కి సినిమా వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య ఏ సినిమా ఎప్పుడు వాయిదా పడుతుందో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఆ సినిమా థియేటర్స్ లోకి వచ్చే ముందు రోజు వరకు కూడా నమ్మకం ఉండడం లేదు.

  • Published Aug 25, 2025 | 11:39 AMUpdated Aug 25, 2025 | 11:41 AM
మిరాయ్  రాక అప్పుడు కష్టమేనా !

నిజానికి సెప్టెంబర్ 5 డేట్ ను అన్నిటికంటే ముందు లాక్ చేసుకుంది మిరాయ్ సినిమానే. కాబట్టి అసలు ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పిన టైం కి సినిమా వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య ఏ సినిమా ఎప్పుడు వాయిదా పడుతుందో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఆ సినిమా థియేటర్స్ లోకి వచ్చే ముందు రోజు వరకు కూడా నమ్మకం ఉండడం లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మిరాయ్ సినిమా కూడా యాడ్ అయింది. సెప్టెంబర్ 5 న రావాల్సిన మిరాయ్ మూవీ వాయిదా పడడం ఖాయమని ఇన్సైడ్ టాక్. పైగా రిలీజ్ కు ఇంకొద్ది రోజుల సమయం పెట్టుకుని ఇంతవరకు సరైన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. మరో వైపు ఫెడరేషన్ సమ్మె వలన సినిమా ఫైనల్ కట్ కాస్త ఆలస్యం అవుతుందని కూడా అంటున్నారు.

సో ఇక సెప్టెంబర్ 5 న మిరాయ్ రావడం కష్టమే అని చెప్పాల్సిందే. ఇంతవరకు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ అయితే రాలేదు కానీ.. ఏ నిమిషమైన మేకర్స్ దీని గురించి ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ఈ పదిరోజుల్లో పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఎక్కువ ల్యాగ్ చేయకుండా కనీసం సెప్టెంబర్ 12 కైనా సినిమాను దింపాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. కానీ ఆ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కర్చీఫ్ వేసుకుని కూర్చున్నాడు. రవి తేజ మాస్ జాతర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే సెప్టెంబర్ 25 న ఓజి రాబోతుంది. కాబట్టి ఒకవేళ సెప్టెంబర్ 12 న మిరాయ్ వస్తే ఈలోపే ఎంత రాబట్టలో అంత రాబట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ ఇది కష్టం అయితే మిరాయ్ అక్టోబర్ కు వెళ్లడం తప్పదు. ఈ సస్పెన్స్ వీడాలంటే త్వరగా టీం నుంచి ఎదో ఒక అప్డేట్ రావాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. ఇక ముందైనా సినిమాలు చెప్పిన సమయానికి వస్తే మంచిదని సినీ పండితులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.