Swetha
సరిగ్గా ఇంకో నెల రోజుల్లో థియేటర్స్ లో విధ్వంసం సృష్టించడానికి OG రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ వారి అంచనాలను అంతకు అంతకు పెంచేస్తున్నాయి. పైగా వచ్చిన ప్రతి అప్డేట్ నుంచి చిన్న చిన్న క్లూస్ వెతుకుతూ స్టోరీని కూడా డీకోడ్ చేయడం మొదలు పెట్టారు అభిమానులు.
సరిగ్గా ఇంకో నెల రోజుల్లో థియేటర్స్ లో విధ్వంసం సృష్టించడానికి OG రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ వారి అంచనాలను అంతకు అంతకు పెంచేస్తున్నాయి. పైగా వచ్చిన ప్రతి అప్డేట్ నుంచి చిన్న చిన్న క్లూస్ వెతుకుతూ స్టోరీని కూడా డీకోడ్ చేయడం మొదలు పెట్టారు అభిమానులు.
Swetha
సరిగ్గా ఇంకో నెల రోజుల్లో థియేటర్స్ లో విధ్వంసం సృష్టించడానికి OG రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ వారి అంచనాలను అంతకు అంతకు పెంచేస్తున్నాయి. పైగా వచ్చిన ప్రతి అప్డేట్ నుంచి చిన్న చిన్న క్లూస్ వెతుకుతూ స్టోరీని కూడా డీకోడ్ చేయడం మొదలు పెట్టారు అభిమానులు. దానికి సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆగస్ట్ 27 న ఓజి నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇప్పుడు ఈ సాంగ్ ఎలా ఉంటుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. పైగా ఇది డ్యూయెట్ సాంగ్ కావడంతో ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సాంగ్ ను ఆగస్ట్ 27 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. సో ఇలా సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అయ్యేవరకు కూడా కంప్లీట్ గా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా.. పక్కా ప్లానింగ్ తో ఉన్నారు ఓజి మేకర్స్. ఇక అటు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా ఓజి స్పీడ్ గానే ఉంది. అడ్వాన్స్ టికెట్స్ వలన ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనేది రీసెంట్ గా కూలీ విషయంలో ప్రూవ్ అయింది. బజ్ ఎక్కువగా ఉంటే కనుక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అదిరిపోతాయి.
ఇప్పుడు ఆ బజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఓజి డిస్ట్రిబ్యూటర్లు ఆగస్ట్ 29 నుంచి అక్కడ టికెట్స్ సేల్స్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నార్త్ అమెరికాలో మొదటి షో పడేలోపు అట్లీస్ట్ రెండు మిలియన్ మార్కుని దాటించాలని టార్గెట్ గా పెట్టుకున్నారట టీం. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇక ఓజిని ఆపడం ఎవరితరం కాదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎంత లేదన్న ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. టాక్ బావుంటే ఇక ఆ ఊచకోత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యాన్స్ అందరి ఆశలు సుజిత్ మీదే ఉన్నాయి. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.