iDreamPost
android-app
ios-app

టీటీడీ ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయంటున్న మోడీ కేబినెట్ సహచరుడు

  • Published Jan 12, 2021 | 6:00 AM Updated Updated Jan 12, 2021 | 6:00 AM
టీటీడీ ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయంటున్న మోడీ కేబినెట్ సహచరుడు

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై టీడీపీ,బీజేపీ నేతల విషప్రచారాలకు, వాస్తవానికి పొంతన లేదని కేంద్రమంత్రి పరోక్షంగా తేల్చేశారు. తాజాగా బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు దానికి నిదర్శనం. మోడీ మంత్రివర్గ సహచరుడే నేరుగా టీటీడీ పాలకమండలి ప్రయత్నాలను అభినందించిన తీరు ఆసక్తికరం. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. తిరుమల వేదికగా మతరాజకీయాలు విపక్షాల సృష్టి అని ఆయన మండిపడ్డారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. స్వామివారి ప్రసాదం,నూతన సంవత్సరం డైరి, క్యాలెండర్ అందించి మంత్రిని శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి చైర్మన్ ను అడిగారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి శ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఇటీవల టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత గురించి శ్రీ సుబ్బారెడ్డి మంత్రికి వివరించారు. ఢిల్లీలో కూడా ఇటీవల ఈ కార్యక్రమం ప్రారంభించామని, దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చైర్మన్ వివరించారు. తమ పాలక మండలి మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తోందని సుబ్బారెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి సుబ్బారెడ్డిని అభినందించారు. ధార్మిక కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని టీటీడీకి సుశించారు.

మంత్రి అభినందనలు చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో టీటీడీ చుట్టూ వివాదాలు రాజేసి పబ్బం గడుపుకునే యత్నంలో ఉన్న వారికి మింగుడుపడని రీతిలో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న కృషికి కేంద్ర పెద్దల అభినందనలు క్షేత్రస్థాయిలో కుట్ర రాజకీయాలకు చెంపదెబ్బ గా కనిపిస్తున్నాయి